ETV Bharat / sports

బాక్సింగ్​, ట్రిపుల్​ జంప్​లో మూడు గోల్డ్​.. ఫైనల్​కు సింధు.. హాకీలో అమ్మాయిలకు కాంస్యం

Indian women's hockey team wons Bronze medal against New zealand
బాక్సింగ్​లో రెండు గోల్డ్.. ఫైనల్​కు సింధు.. హాకీలో అమ్మాయిలకు కాంస్యం
author img

By

Published : Aug 7, 2022, 3:16 PM IST

Updated : Aug 7, 2022, 8:29 PM IST

15:10 August 07

బాక్సింగ్​, ట్రిపుల్​ జంప్​లో మూడు గోల్డ్​.. ఫైనల్​కు సింధు.. హాకీలో అమ్మాయిలకు కాంస్యం

కామెన్వెల్త్​ క్రీడల్లో భాగంగా భారత్​ ఖాతాలో మరో ఏడు పతకాలు వచ్చి చేరాయి. బాక్సింగ్​లో పురుషుల ఫ్లైవెయిట్‌లో అమిత్‌ పంగల్‌, మహిళల మినిమమ్‌ వెయిట్‌లో నితూ గంఘాస్‌లు బంగారు పతకాలు సాధించారు. ప్రత్యర్థి ఇంగ్లీష్‌ బాక్సర్‌ కియరన్‌ మెక్‌డొనాల్డ్‌పై అమిత్‌ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. మొదటి రౌండ్‌లో 5-0,రెండో రౌండ్‌లో 4-1 తేడాలో గెలుపొందాడు. నితూ సైతం ఇంగ్లాండ్‌కే చెందిన ప్రత్యర్థి జేడ్‌ రెస్థన్‌పై పంచుల వర్షం కురిపించింది. మొదటి రౌండ్‌ను 4-1 తేడాతో, రెండో రౌండ్‌లోనూ 4-1తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.

ఇక న్యూజిలాండ్‌తో జరిగిన హాకీ పోరులో పెనాల్టీ షూటవుట్‌లో 2-1 తేడాతో భారత మహిళలు విజయం సాధించారు. మ్యాచ్‌ ముగియడానికి కొద్ది సెకన్ల ముందు న్యూజిలాండ్‌ 1-1తో స్కోరును సమం చేసింది. దీంతో ఆట పెనాల్టీ షూటవుట్‌కు దారితీసింది. ఇందులో భారత్‌ అద్భుతమైన ప్రదర్శన చేసింది. పెనాల్టీ షూటవుట్‌లో న్యూజిలాండ్‌ ఒకే గోల్‌ సాధించగా.. టీమ్‌ఇండియా 2 గోల్స్‌తో కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత అమ్మాయిల హాకీ జట్టును రిఫరీ తప్పిదం దెబ్బ తీసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ పెనాల్టీ షూటౌట్లో 0-3 తేడాతో ఓడింది. ఇంకా ట్రిపుల్​ జంప్​లో Eldhose Paulకు గోల్డ్​ వరించగా.. అబ్దుల్లా అబూబాకర్​కు రజతం వరించింది.

ఫైనల్స్​కు సింధు, లక్ష్యసేన్​.. మరోవైపు తెలుగు తేజం, ఒలింపిక్‌ పతకాల విజేత​ పీవీ సింధు కూడా మహిళల సింగిల్స్​ఫైనల్‌కు దూసుకెళ్లి మరో మెడల్‌ను ఖాయం చేసుకుంది. సెమీస్‌లో సింగ్‌పూర్‌కు చెందిన యో జియా మిన్‌పై 21-19, 21-17 తేడాతో సింధు అద్భుత విజయ సాధించింది. ఆరంభం నుంచే సింధు, మిన్‌ ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. పాయింట్ల కోసం హోరాహోరీ పోరు తప్పలేదు. అయితే కీలకమైన సమయంలో ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా పీవీ సింధు తొలి సెట్‌ను రెండు పాయింట్ల తేడాతో కైవసం చేసుకుంది. ఇక రెండో సెట్‌లోనూ ఆధిక్యం మారుతూ వచ్చింది. అయితే 11-9 ఛేంజ్‌ఓవర్‌ తర్వాత మిన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌పాయింట్‌ను సాధించి పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్​లో భారత ప్లేయర్ లక్ష్యసేన్ ఫైనల్స్​లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్​లో సింగపూర్ ప్లేయర్ జియా హింగ్ థేపై 21-10, 18- 21, 21 -16 తేడాతో విజయాన్ని సాధించి ఫైనల్​లోకి దూసుకెళ్లాడు. పది కిలోమీటర్ల రేస్ వాక్​లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు. మహిళల జావెలిన్‌ త్రో విభాగంలో భారత్‌కు చెందిన అన్ను రాణి మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. జావెలిన్‌ను 60 మీటర్ల దూరం విసిరి ఈ పతకాన్ని దక్కించుకుంది. అయితే కామన్వెల్త్​ పతక విజేతలందరికీ ట్విట్టర్​ వేదికగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్‌ తాజా గణాంకాల ప్రకారం.. 16 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలతో 5వ స్థానంలో ఉంది. భారత్‌ ఖాతాలో ఇప్పటివరకు మొత్తంగా 47 పతకాలున్నాయి. అయితే 44 పతకాలతోనే ఉన్న న్యూజిలాండ్‌ 4వ స్థానంలో కొనసాగుతోంది. ఎందుకంటే ఆ దేశ ఖాతాలో 17 స్వర్ణాలు ఉండటమే కారణం. అయితే ఇంకా మరిన్ని విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడనుంటడం వల్ల న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 164 (61 స్వర్ణాలు) పతకాలతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, ఆతిథ్య దేశం ఇంగ్లాండ్‌ 155 (50 స్వర్ణాలు), కెనడా 85 (23 స్వర్ణాలు) పతకాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: పంత్​పై రోహిత్​ ఫైర్​.. ఎందుకంటే?

Last Updated : Aug 7, 2022, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.