ETV Bharat / sports

వెయిట్​లిఫ్టింగ్​లో​ కాంస్యం.. హాకీ, బాక్సింగ్​లో భారత్​ జోరు - కామన్​వెల్త్ గేమ్స్ 2022

Commonwealth games 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ జోరు మీదుంది. వెయిట్‌లిఫ్టింగ్‌ 109 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ లవ్‌ప్రీత్‌ కాంస్య పతకం దక్కించుకున్నాడు. మరోవైపు మహిళల హాకీ జట్టు సెమిస్​లోకి దూసుకెళ్లింది.

Commonwealth games 2022
Commonwealth games 2022
author img

By

Published : Aug 3, 2022, 10:54 PM IST

Commonwealth games 2022: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌ 109 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ లవ్‌ప్రీత్‌ కాంస్య పతకం దక్కించుకున్నాడు. స్నాచ్‌లో 163 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 192 కేజీలు.. మొత్తం 355 కేజీలు ఎత్తి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ రికార్డును నెలకొల్పడం విశేషం. దీంతో భారత్ పతకాల సంఖ్య 14కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఐదు రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.

జూడోలో 100 కేజీల విభాగంలో భారత ప్లేయర్‌ దీపక్‌ దేశ్వాల్ తన పోరాటం ముగించాడు. ఫిజీ జూడో ఆటగాడు తెవితా తకయవా చేతిలో ఓటమిపాలయ్యాడు. లాన్‌బౌల్స్‌ మూడో రౌండ్‌లో మహిళల పెయిర్స్ విభాగంలో దక్షిణాఫ్రికాతో భారత్‌ 5-5తో నిలిచింది. ప్రస్తుతం ఐదు రౌండ్లు ముగిసేసరికి ఇరు జట్లూ సమంగా నిలిచాయి.

భారత మహిళల జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో హకీ విభాగంలో క్వార్టర్‌ఫైనల్‌లో 3-2 తేడాతో కెనడాపై టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. పూల్‌ -ఏ చివరి మ్యాచ్‌లో విజయంతో సెమీస్‌ బెర్తును భారత్‌ ఖరారు చేసుకుంది. మూడో క్వార్టర్‌ వరకు 2-2తో సమంగా నిలిచిన ఇరు జట్లు.. చివరి క్వార్టర్‌లో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లడం వల్ల భారత్‌ గెలుపొందింది. పూల్‌-ఏలో రెండో స్థానంతో స్టేజ్‌దశను భారత్‌ ముగించింది. దీంతో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది.

మహిళల 45-48 కేజీల విభాగం క్వార్టర్‌ఫైనల్‌లో నికోల్‌ స్లైడ్‌తో భారత్‌ బాక్సర్‌ నీతూ తలపడుతోంది. ఇక జూడోలో 78+ కేజీల మహిళల విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన సైడ్నీ ఆండ్రూస్‌ను ఓడించి భారత్ క్రీడాకారిణి తులికా మాన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఈ విభాగంలో మరొక పతకం భారత్‌ సొంతం కానుంది. లాన్‌బౌల్స్‌ మహిళల పెయిర్స్‌ రౌండ్‌ -3లో దక్షిణాఫ్రికా, భారత్‌ పోటాపోటీగా ఆడుతున్నాయి. ప్రస్తుతం 12-12తో సమంగా కొనసాగుతున్నాయి.

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ జోరు మీదుంది. ఇప్పటికే 14 పతకాలు( 5 స్వర్ణ , 5 రజత, 4 కాంస్య) ఖాతాలో ఉన్నాయి. తాజాగా భారత బాక్సర్లు హుస్సాముద్దీన్ మహ్మద్, నీతూ ఘంగాస్‌ మరో రెండు పతకాలు ఖాయం చేశారు. పురుషుల 57 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్‌లో హుస్సాముద్దీన్‌.. నమీబియాకు చెందిన ట్రయాగైన్‌ మార్నింగ్‌పై 4-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించాడు. మరోవైపు 21 ఏళ్ల మహిళా బాక్సర్‌ నీతూ ఘంగాస్‌(47 కేజీల విభాగం) క్వార్టర్ ఫైనల్ లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన నికోల్ క్లాయిడ్‌ను ఓడించింది. దీంతో భారత్‌కు బాక్సింగ్‌లో రెండు పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు ఈ రోజే ముగ్గురు భారత బాక్సర్లు లోవ్లినా బోర్గోహైన్, నిఖత్ జరీన్ ,ఆశిష్ కుమార్‌కు క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లున్నాయి. వీరి ముగ్గురు ప్రతిభావంతులే కావడం వల్ల బాక్సింగ్‌లో పతకాల మోత మోగించనుంది.

ఇవీ చదవండి: 'ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌..' ప్రెజెంటేషన్‌ ఇవ్వాలని ఐసీసీకి ఆహ్వానం

Commonwealth Games: 'మా విజయం.. వారిలో మరింత విశ్వాసాన్ని నింపుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.