Commonwealth Games 2022 : కెనడాలోని కాల్గరీ వేదికగా జులై 4న ప్రారంభం కానున్న కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ ఈవెంట్లో రాణించి.. వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో మెరుగుపడాలని భావిస్తోంది. ఈ టోర్నీలో సింధుతో పాటు స్టార్ షట్లర్ లక్ష్య సేన్ కూడా పాల్గొననున్నాడు.
అయితే, గాయం నుంచి కొలుకున్న సింధు.. ఈ ఏడాది జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్‌లో తిరిగి షటిల్ పట్టుకుంది. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో సింధుకు నిరాశ ఎదురైంది. ఆ తర్వాత ఏప్రిల్‌లో జరిగిన మాడ్రిడ్ మాస్టర్స్ సూపర్ 300 ఈవెంట్లో ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత జరిగిన రెండు టోర్నీల్లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించింది. మరో ఈవెంట్లో రెండో రౌండ్లో ఇంటిదారి పట్టింది. దీంతో కెనడా ఓపెన్‌పై భారీ ఆశలు పెట్టుకుంది సింధు. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ కూడా పురుషుల సింగిల్స్ ర్యాంకిగ్స్‌లో టాప్ -10 నుంచి పడిపోయాడు. ప్రస్తుతం అతడు 19 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
సింధు కొత్త కోచ్..
PV Sindhu New Coach : పీవీ సింధు తన కోచ్‌ను మార్చనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్‌ను టార్గెట్‌గా పెట్టుకున్న సింధు.. మహమ్మద్ హఫీజ్ హషీమ్‌ను కొత్త కోచ్‌గా నియమించుకోవాలనుంటోంది. మలేషియాకు చెందిన మహమ్మద్ హఫీజ్.. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ మాజీ ఛాంపియన్. అతడి దగ్గర ట్రెయినింగ్ పొందడానికి అనుమతి ఇవ్వాలంటూ.. సింధు రీసెంట్గా భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)కు లేఖ రాసింది.
ఒలంపిక్స్ 2024కు క్వాలిఫయర్స్ మే 1న ప్రారంభమయ్యాయి. ఇవి వచ్చే ఏప్రిల్ 28 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు వారాల నుంచి సింధు.. సుచిత్ర అకాడమీలో హఫీజ్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తోంది. హఫీజ్‌కు గతంలో మలేసియా బ్యాడ్మింటన్ సంఘం జూనియర్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. కాగా ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో అవధె వారియర్స్‌కు కోచ్‌గా పని చేశాడు.
PV Sindhu Injury : గతేడాది ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు గాయం అయింది. దాదాపు ఐదు నెలల పాటు సింధు ఇంట్లోనే ఉంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్‌లో తిరిగి షటిల్ పట్టుకున్న సింధు ఓటమి పాలైంది. అదే నెలలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో కూడా ఓడిపోయింది. 2023 మార్చి ఆరంభంలో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ నుంచి మొదటి రౌండ్లోనే బయటకు వచ్చేసింది పీవీ సింధు. ఆ తర్వాత జరిగిన స్విస్ ఓపెన్ సూపర్ 300లో టైటిల్ చేజార్చుకుంది.