ETV Bharat / sports

WTC Final 2023 : భారత్​కు మళ్లీ నిరాశే.. డబ్ల్యూటీసీ విజేతగా ఆస్ట్రేలియా - wtc final 2023 india jersy

Wtc Final 2023 Winner : భారత్​కు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. భారత్​పై 209 పరుగుల తేడాతో గెలిచి ఛాంపియన్స్​గా నిలిచింది ఆస్ట్రేలియా.

wtc final 2023 winner
wtc final 2023 winner
author img

By

Published : Jun 11, 2023, 5:11 PM IST

Updated : Jun 11, 2023, 5:24 PM IST

Wtc Final 2023 Winner : టెస్టు క్రికెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే WTC Finalలో మరోసారి భారత్‌ పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ఈ మహాసమరంలో ఆస్ట్రేలియా జగజ్జేతగా నిలిచి సత్తా చాటింది. రెండోసారి ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఈ సారైన టైటిల్‌ గెలిచి ఐసీసీ ట్రోఫీల కరవును తీర్చుతుందన్న అభిమానుల ఆశలపై రోహిత్‌ సేన నీళ్లు చల్లింది. అన్ని రంగాల్లో విఫలమై.. కీలకమైన పోరులో మరోసారి తడబాటుకు గురైన 209 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీ భారత్‌కు కలగానే మిగిలిపోయింది.

444 పరుగుల ఛేదనలో 164/3తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ ఇండియా.. ఆసీస్‌ బౌలింగ్‌ ధాటికి నిలువలేకపోయింది. రికార్డు ఛేజింగ్‌లో ఆశలు రేపిన కోహ్లీ, రహానె వికెట్లు పడిపోవడంతో.. టీమ్‌ఇండియా పతనం ప్రారంభమైంది. అర్ధశతకానికి చేరువలో కోహ్లీ(49) బోలాండ్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన జడేజా పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. రహానె(46) కూడా ఆ తర్వాత ఎక్కువ సేపు నిలవలేదు. స్టార్క్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ కారేకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. శార్దూల్‌ ఠాకూర్‌ ఎల్బీగా దొరికిపోగా.. చివర్లో కేఎస్‌ భరత్‌ (23) కాసేపు క్రీజ్‌లో నిలించేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు.

WTC Final 2023 Teamindia vs Australia : టెస్టు క్రికెట్‌కు తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు.. వరల్డ్​ టెస్టు ఛాంపియన్​ షిప్​ను 2019లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది ఐసీసీ. పాయింట్స్​ టేబుల్​లో టాప్‌ రెండు స్థానాల్లో ఉన్న జట్లతో రెండేళ్లకోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ను నిర్వహిస్తోంది. మొదటి ఎడిషన్​లో భారత్-న్యూజిలాండ్‌ తలపడగా.. కివీస్​ విజయం సాధించి గదను దక్కించుకుంది. ఈ ఎడిషన్​లో తొమ్మిది జట్లు పోటీపడగా.. మరోసారి టీమ్​ఇండియా ఫైనల్​ చేరుకుంది. అలానే భారత్​తో తలపడేందుకు ఆస్ట్రేలియా ఈ తుదిపోరుకు అర్హత సాధించింది. ఇంగ్లాండ్​లోని ఓవల్​వేదికగా జూన్​7 నుంచి 11 వరకు జరిగిన మ్యాచ్​లో తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. వరుసగా రెండో సారి ఓడిపోయి భారత్​ ఘోర పరాభవం మూడగట్టుకుంది.

WTC Final Prizemoney : ఈ వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు గదను అందిస్తారు. దీంతో పాటు ఆ టీమ్​కు రూ.13 కోట్లు (1.6 మిలియన్‌ డాలర్లు) ప్రైజ్‌మనీ అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన భారత్​.. రూ.6.5 కోట్లు (8 లక్షల డాలర్లు) నగదు బహుమతి దక్కంచుకుంది.

Last Updated : Jun 11, 2023, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.