ETV Bharat / sports

'డర్టీ పాలిటిక్స్'.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం - విరాట్ కోహ్లీ న్యూస్

Virat Kohli Press Conference: టీమ్​ఇండియా టీ20 కెప్టెన్​గా తప్పుకొన్న సమయంలో తనను సారథిగా ఉండమని తనకు ఎవరూ చెప్పలేదని విరాట్​ కోహ్లీ అన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వ్యాఖ్యలకు విరుద్ధంగా విరాట్​ ఈ మాటలు అన్నాడు. ఈ నేపథ్యంలో గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జై షాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

kohli, ganguly
కోహ్లీ, గంగూలీ
author img

By

Published : Dec 15, 2021, 5:26 PM IST

Virat Kohli Press Conference: టీమ్​ఇండియాలో గత వారం రోజులుగా ఆందోళనకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. వన్డే జట్టు సారథిగా కోహ్లీని తప్పించి రోహిత్​కు బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. అనంతరం.. టీ20 సారథిగా తప్పుకోవద్దని చెప్పినా.. కోహ్లీ కెప్టెన్సీ వదిలేశాడని బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీ ఓ సందర్భంలో తెలిపాడు. ఈ పరిణామాల నడుమ రోహిత్​ తొడకండరాల గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​కు హాజరుకాలేనని చెప్పడం, కోహ్లీ వన్డే సిరీస్​కు దూరమవుతున్నట్లు వదంతులు రావడం వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో జట్టులో అసలేం జరుగుతుందో అభిమానులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

నాకు అసలు చెప్పనేలేదు..

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ.. రోహిత్​కు తనకు ఎలాంటి వివాదం లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే.. టీ20 జట్టు కెప్టెన్సీ వదిలేయొద్దని తనకు ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశాడు. వన్డే జట్టు సారథి తొలగింపు విషయంలోనూ బీసీసీఐకి అతడికి సరైన చర్చలు జరగలేదని పేర్కొన్నాడు. కెప్టెన్సీ నిర్ణయానికి 90 నిమిషాల ముందు సెలెక్టర్లు తనకు ఫోన్​ చేసి సమాచారం అందించారని చెప్పుకొచ్చాడు.

రిక్వెస్ట్ చేశా..

వన్డే కెప్టెన్​గా కోహ్లీని తొలగించిన అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'టీ20 కెప్టెన్సీ వదిలేయొద్దని విరాట్​ కోహ్లీని వ్యక్తిగతంగా కోరాను. కానీ, ఒత్తిడి పెరుగుతుందని విరాట్​ సారథిగా తప్పుకొంటున్నట్లు చెప్పాడు. ఇది సరైన నిర్ణయమే. విరాట్​ ఓ మంచి ప్లేయర్. చాలా ఏళ్ల నుంచి సారథిగా అతడే ఉన్నాడు కాబట్టి కోహ్లీపై కాస్త ఒత్తిడి పెరిగింది.' అని గంగూలీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఈ వ్యాఖ్యలకు విరుద్ధంగా.. కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని తనను ఎవరూ కోరలేదని విరాట్​ చెప్పడం ప్రస్తుతం ఇది మరో వివాదాస్పద అంశంగా మారింది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై, జై షాపై మండిపడుతున్నారు. జట్టు ప్రయోజనాల గురించి మరిచిపోయి చెత్త రాజకీయాలు చేస్తున్నారని ట్వీట్లు చేస్తున్నారు.

  • With Virat Kohli today's press conference everything is clear

    Its not Virat Vs Rohit Sharma
    Its actually Virat Vs BCCI

    Sourav Ganguly , Jay Shah, the @BCCI , selection committee is making the team collapse

    Request to Virat & Rohit fans to stay together #ShameOnBCC pic.twitter.com/UKZ0y3HRa1

    — AADITYA🇮🇳 (🕉️☪️✝️☬) (@beingaaditya02) December 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

క్రీడల కంటే ఎవరూ గొప్ప కాదు: అనురాగ్ ఠాకూర్

'సౌతాఫ్రికాతో వన్డే సిరీస్​లో ఆడతా.. రోహిత్​తో ఎలాంటి గొడవలు లేవు'

'సరైన సమాచారం లేకుండా కెప్టెన్సీ నుంచి తొలగించారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.