ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో టెస్టు​ సిరీస్​.. రికార్డులపై కోహ్లీ, రోహిత్ గురి! - రవిచంద్రన్​ అశ్విన్

టెస్టు సిరీస్​ కోసం టీమ్ఇండియా, ఇంగ్లాండ్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ సిరీస్​లో ప్రత్యర్థిని ఓడించి టెస్టుల్లో నంబర్​ వన్​ స్థానానికి వెళ్లాలని టీమ్ఇండియా భావిస్తోంది. అలానే పలు రికార్డులు మన క్రికెటర్లకు చేరువలో ఉన్నాయి. ఇంతకీ ఆ రికార్డులేంటి?

Virat Kohli' 8k, Ashwin and Bumrah's 100, and Other Milestones in Upcoming Series with England
ఇంగ్లాండ్​ సిరీస్​లో భారత ఆటగాళ్ల సాధించనున్న రికార్డులివే!
author img

By

Published : Aug 2, 2021, 5:30 AM IST

భారత్​, ఇంగ్లాండ్​ మధ్య 5 టెస్టుల సిరీస్​ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. ఇరుజట్లు పోటీ పడిన పలు సిరీస్​లలో ఆతిథ్యజట్టుదే పైచేయి. ఈసారి మాత్రం ఆ సంప్రదాయం మారుతుందని భారత ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే ఈ టెస్టు మ్యాచ్​ల సిరీస్​లో టీమ్ఇండియా క్రికెటర్లు కొన్ని ఘనతలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారెవరు? ఆ క్రికెటర్లు సాధించే మైలురాళ్లు ఏవో తెలుసుకుందాం.

ఇంగ్లాండ్​తో సిరీస్​లో టీమ్ఇండియా ఆటగాళ్లు సాధించనున్న రికార్డుల వివరాలు..

విరాట్​ కోహ్లీ

  • కోహ్లీ మరో 453 పరుగులు చేస్తే.. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
  • అంతర్జాతీయ క్రికెట్​లో ఇప్పటివరకు 70 శతకాలు చేసిన కోహ్లీ.. చివరగా 2019లో బంగ్లాదేశ్​పై టెస్టు సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ రికీ పాంటింగ్​ 70 శతకాలు రికార్డును అధిగమించి.. సచిన్​ తెందూల్కర్​ తర్వాత రెండో స్థానంలో నిలిచే అవకాశం కోహ్లీకి ఈ సిరీస్​లో ఉంది.
  • ఇంగ్లాండ్​తో కోహ్లీ ఆడిన 23 టెస్టుల్లో ఇప్పటివరకు 1742 పరుగులు చేశాడు. ప్రస్తుత సిరీస్​లో మరో 258 పరుగులు చేస్తే.. ఆ జట్టుపై 2 వేల పరుగులు​ చేసిన క్రికెటర్​గా రాహుల్​ ద్రవిడ్​ సరసన చేరుతాడు.
  • టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు సచిన్​ తెందూల్కర్​, రాహుల్​ ద్రవిడ్​.. ఇంగ్లాండ్​ జట్టుపై తలో ఏడు సెంచరీలు చేశారు. కోహ్లీ ఇప్పటికే ఆ జట్టుపై 5 శతకాలు కొట్టగా, ఇంగ్లాండ్​పై ఎక్కువ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్​మన్​గా నిలిచేందుకు కోహ్లీకి అవకాశం ఉంది.
  • టెస్టుల్లో కోహ్లీ ఇప్పటివరకు 90 క్యాచ్​లు పట్టాడు. ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​లో అది 100కు చేరే అవకాశం ఉంది.

అజింక్య రహానె

  • 74 టెస్టుల్లో ఆడిన టీమ్ఇండియా వైస్​కెప్టెన్​ అజింక్య రహానె.. ఇప్పటివరకు 4647 రన్స్​ చేశాడు. మరో 353 పరుగులు చేస్తే టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
  • టెస్టుల్లో 96 క్యాచ్​లు పట్టిన రహానె.. ఈ సిరీస్​తో 100 మార్క్​ను అందుకునే అవకాశం ఉంది.

రోహిత్​ శర్మ

  • టీమ్ఇండియా బ్యాట్స్​మన్​ రోహిత్​ శర్మ టెస్టుల్లో ఇప్పటివరకు 2,679 పరుగులు చేయగా.. మరో 321 రన్స్​ నమోదు చేస్తే 3 వేల పరుగులు మైలురాయిని చేరుకుంటాడు.

జస్ప్రీత్​ బుమ్రా

  • టెస్టుల్లో ఇప్పటివరకు 83 వికెట్లు(20 టెస్టుల్లో) తీసిన పేసర్​​ బుమ్రా.. 100 వికెట్ల మైలురాయికి చేరుకునేందుకు మరెంతో దూరం లేదు. ఇదే సిరీస్​లో బుమ్రా ఆ ఘనత సాధిస్తే.. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత పేసర్​గా బుమ్రా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డు ఇప్పుడు భారత లెజండరీ కెప్టెన్ కపిల్​ దేవ్​(25 టెస్టులు) పేరిట ఉంది.

రవిచంద్రన్​ అశ్విన్​

  • ఇంగ్లాండ్​ జట్టుపై ఈ సిరీస్​తో​ రవిచంద్రన్​ అశ్విన్​ మరో 12 వికెట్లు సాధిస్తే.. ఆ జట్టుపై 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్​గా రికార్డు నెలకొల్పుతాడు. ​

రవీంద్ర జడేజా

  • టెస్టుల్లో 2 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు టీమ్ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా మరో 15 రన్స్​ కావాలి.

మహమ్మద్​ షమి

  • టెస్టుల్లో 200 వికెట్లు ఘనత సాధించేందుకు.. షమి మరో 16 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.

ఇంగ్లాండ్​ క్రికెటర్లూ..

వీరితో పాటు ఈ సిరీస్​లో ఇంగ్లాండ్​ క్రికెటర్లు రికార్డులను నమోదు చేసే అవకాశం ఉంది. ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​.. టెస్టుల్లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకోవాలంటే మరో 286 రన్స్​ చేయాలి. ఇంగ్లీష్ బౌలర్​ స్టువర్ట్​ బ్రాడ్​ టెస్టుల్లో 150 వికెట్లు మైలురాయిని చేరుకునేందుకు మరో 2 వికెట్ల దూరంలోనే ఉన్నాడు.

ఇదీ చూడండి.. పొట్టి ప్రపంచకప్​లో టీమ్ఇండియా జట్టు ఇదేనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.