ETV Bharat / sports

టెస్టు చరిత్రలో స్వర్ణయుగం.. కోహ్లీ శకం- ఈ రికార్డులపై ఓ లుక్కేయండి - virat kohli records

Virat Kohli 100 Test: బ్యాటర్​గా, కెప్టెన్​గా కెరీర్​లో ఎన్నో ఘనతలు అందుకున్న విరాట్​ కోహ్లీ.. మరో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. శ్రీలంకతో మార్చి 4న ఆరంభమయ్యే తొలి టెస్టు.. అతడికి 100వది. ఈ నేపథ్యంలో అతడు సాధించిన శతకాలు, బ్రేక్ చేసిన రికార్డులు, అందుకున్న ఘనతలపై ఓ లుక్కేయండి.

virat kohli 100 test
virat kohli records
author img

By

Published : Mar 3, 2022, 4:46 PM IST

Updated : Mar 3, 2022, 5:23 PM IST

Virat Kohli 100 Test: శుక్రవారం 100వ టెస్టు మైలురాయిని అందుకోనున్నాడు టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మొహాలీ వేదికగా శ్రీలంకతో ప్రారంభమయ్యే తొలి టెస్టుతో ఆ ఘనత దక్కించుకోనున్నాడు. భారత్​ తరఫున 100 టెస్టులాడిన 12వ ప్లేయర్​గా నిలవనున్నాడు.

2011 జూన్​లో వెస్టిండీస్​పై సుదీర్ఘ ఫార్మాట్​లో అరంగేట్రం చేశాడు విరాట్. తొలి టెస్టు సెంచరీని 2012 జనవరిలో ఆస్ట్రేలియాపై సాధించాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 99 మ్యాచ్​ల్లో 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. అందులో 27 శతకాలు, 28 అర్ధ శతకాలున్నాయి. అత్యధిక స్కోరు 254*.

కెప్టెన్సీ ఇలా..

virat kohli 100 test
మాజీ సారథి కోహ్లీ

2014 ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ గాయపడటం వల్ల తొలి టెస్టుకు సారథ్యం వహించాడు కోహ్లీ. ఆ మ్యాచ్​లో భారత్​ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే రెండు ఇన్నింగ్స్​ల్లోనూ సెంచరీలతో విరాట్ అదరగొట్టేశాడు. సారథిగానూ మెప్పించాడు. దీంతో ఆ సిరీస్​ నాలుగో టెస్టుకు ముందే ధోని తప్పుకొని కెప్టెన్సీ బాధ్యతను కోహ్లీకి అప్పగించాడు. ఈ క్రమంలోనే 40 టెస్టు విజయాలతో చరిత్రలో అత్యంత విజయవంతమైన నాలుగో కెప్టెన్​ స్థాయికి ఎదిగాడు విరాట్. దాంతో పాటే ఎన్నో రికార్డులు సాధించాడు. వాటిల్లో టాప్-7పై ఓ లుక్కేయండి..

విరాట్ టాప్-7 రికార్డులు..

  • టెస్టుల్లో కెప్టెన్​గా భారత్​ తరఫున అత్యధిక స్కోరు (254*) సాధించింది కోహ్లీనే. ఆ తర్వాతి రెండు అత్యధిక స్కోర్లు (243, 235) కూడా అతడివే కావడం విశేషం. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత మాజీ సారథి ఎంఎస్ ధోనీ (224) ఉన్నాడు.
  • ఒక సిరీస్​లో అత్యధిక శతకాలు (4) బాదిన భారత క్రికెటర్లలో దిగ్గజం సునీల్​ గావస్కర్​తో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు కోహ్లీ. 2014/2015లో ఆస్ట్రేలియా పర్యటనలో 4 సెంచరీలతో కలిపి 692 పరుగులు చేశాడు విరాట్. గావస్కర్.. ఈ ఘనతను రెండు సార్లు అందుకున్నాడు. అయితే అందులో ఒకటి 7మ్యాచ్​లు, మరొకటి 6 మ్యాచ్​ల సిరీస్​ కాగా, నాలుగు మ్యాచ్​ల సిరీస్​లోనే కోహ్లీ.. నాలుగు సెంచరీలు చేయడం విశేషం.
    virat kohli 100 test
    కోహ్లీ
  • సారథ్యం వహించిన 68 టెస్టుల్లో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన టీమ్​ఇండియా కెప్టెన్​గా నిలిచాడు కోహ్లీ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విజయవంతమైన కెప్టెన్​లలో నాలుగో స్థానంలో ఉన్నాడు . గ్రేమ్ స్మిత్ (53 విజయాలు), రిక్కీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) అతడికంటే ముందున్నారు.
  • భారత్​ తరఫున అత్యధిక శతకాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు కోహ్లీ (27). సచిన్ (51), ద్రవిడ్ (36), గావస్కర్ (34) అతడికన్నా ముందున్నారు.
  • కెప్టెన్​గా అత్యంత వేగంగా 5వేల పరుగుల మైలురాయి చేరుకున్నది కోహ్లీనే. 86 ఇన్నింగ్స్​ల్లో ఈ ఘనత అందుకున్నాడు. అత్యంత వేగంగా 4వేల పరుగుల మార్కునూ అందుకుంది అతడే.
  • భారత్ తరపున అత్యధిక ద్విశతకాలు సాధించాడు విరాట్ కోహ్లీ (7). ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండ్ క్రికెటర్​ వాలీ హామండ్ (7)​, శ్రీలంక మాజీ సారథి మహేలా జయవర్ధనే (7)తో కలిసి నాలుగో స్థానంలో ఉన్నాడు.
  • టెస్టు క్రికెట్ చరిత్రలో కెప్టెన్​గా అత్యధిక ద్విశతకాలు సాధించింది కూడా కోహ్లీనే (7). అతడి డబుల్స్​ అన్నీ సారథిగా ఉన్నప్పుడు చేసినవే. వెస్టిండీస్​ దిగ్గజం బ్రియన్​ లారా (5) అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక కెప్టెన్​గా గ్రేమ్​ స్మిత్​ (25) తర్వాత అత్యధిక శతకాలు కోహ్లీవే (20).
    virat kohli 100 test
    రన్​ మెషీన్

విరాట్ కోహ్లీ వన్డే, టీ20 కెరీర్​..

వన్డేల్లో- 260 మ్యాచ్​లు ఆడిన రన్​మెషీన్​.. 58.07 సగటుతో 12,311 పరుగులు చేశాడు. 43 సెంచరీలు, 64 హాఫ్​ సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. అత్యధిక స్కోరు 183*.

టీ20ల్లో- 97 మ్యాచ్​ల్లో 51.50 సగటుతో 3,296 పరుగులు చేశాడు విరాట్. 30 అర్ధ శతకాలు చేసిన అతడు.. ఈ ఫార్మాట్​లో సెంచరీ చేయలేకపోయాడు. అత్యధిక స్కోరు 94.

virat kohli 100 test
కోహ్లీ

విరాట్ టెస్టు సెంచరీలు..

  • టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యధికంగా 7 సెంచరీలు బాదాడు
  • ఇంగ్లాండ్​పై అత్యధికంగా 1960 పరుగులు చేశాడు
  • విరాట్​ తన చివరి శతకాన్ని 2019లో కోల్​కతాలో బంగ్లాదేశ్​తో జరిగిన డేనైట్​ టెస్టులో సాధించాడు. అతడు అంతర్జాతీయ కెరీర్​లో మరో సెంచరీ చేయక 28నెలలు దాటింది. ఈ నేపథ్యంలోనే తన 100వ టెస్టులోనైనా శతకం బాదాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టెస్టుల్లో ప్రత్యర్థి జట్లపై విరాట్​..

జట్టు టెస్టులు పరుగులు సగటు శతకాలు
ఆస్ట్రేలియా20168248.067
బంగ్లాదేశ్439278.402
ఇంగ్లాండ్27196043.565
న్యూజిలాండ్1186645.583
దక్షిణాఫ్రికా14123656.183
శ్రీలంక9100477.235
వెస్టిండీస్1482243.262

ఈ మైలురాళ్లకు చేరువలో..

virat kohli 100 test
విరాట్ చిద్విలాసం
  • కోహ్లీ.. మరో 38 పరుగులు చేస్తే టెస్టుల్లో 8వేల పరుగుల క్లబ్​లో చేరతాడు. ప్రస్తుతం అతడు 7962 పరుగుల వద్ద ఉన్నాడు.
  • మొహాలీలో శతకం చేస్తే.. అది అతడి 71వ అంతర్జాతీయ సెంచరీ అవుతుంది. అప్పుడు ఆసీస్ మాజీ సారథి రిక్కీ పాంటింగ్ సరసన చేరతాడు.
  • 100వ టెస్టులో ఇప్పటివరకు ఏ భారతీయ ఆటగాడు సెంచరీ చేయలేదు. ఈ ఘనత సాధించే తొలి టీమ్ఇండియా బ్యాటర్​గా నిలిచే అవకాశం అతడి ముందుంది.
  • 100వ టెస్టులో రెండు శతకాలు బాదిన ఏకైక బ్యాటర్​​ ఇప్పటికీ పాంటింగ్​ మాత్రమే ఉన్నాడు.
  • 1968లో చేసిన సెంచరీతో 100వ టెస్టులో ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్​గా నిలిచాడు మాజీ ఇంగ్లాండ్ ప్లేయర్​ కోలిన్ కౌడ్రే.
    virat kohli 100 test
    విరాట్

ఇప్పటివరకు 100 టెస్టులు ఆడిన భారత క్రికెటర్లు..

  • సచిన్ తెందూల్కర్​-200
  • రాహుల్ ద్రవిడ్-163
  • వీవీఎస్ లక్ష్మణ్-134
  • అనిల్ కుంబ్లే-132
  • కపిల్ దేవ్-131
  • సునీల్ గావస్కర్​-125
  • దిలీప్​ వెంగ్​సర్కార్-116
  • సౌరవ్ గంగూలీ-113
  • ఇషాంత్ శర్మ-104
  • హర్భజన్ సింగ్-103
  • వీరేంద్ర సెహ్వాగ్​-103

ఈ సంగతులు తెలుసా?

virat kohli 100 test
విరాట్ కోహ్లీ

ఇప్పటివరకు కోహ్లీ 99 టెస్టులు ఆడాడు. అతడు కాకుండా ప్రస్తుత టీమ్ఇండియాలో ఛెతేశ్వర్ పుజారా (95), అజింక్య రహానె (82), ఆర్ అశ్విన్ (84).. 100వ టెస్టు ఘనతకు చేరువలో ఉన్నారు.

మాజీల్లో.. మహ్మద్ అజారుద్దీన్ భారత్ తరపున 99 టెస్టులు ఆడాడు. అతడితో పాటు జహీర్​ ఖాన్ (91), జీఆర్ విశ్వనాథ్ (91), ఎంఎస్​ ధోనీ (90).. 90కి పైగా టెస్టులు ఆడిన ఇతర భారత క్రికెటర్లు.

ఇవీ చూడండి:

100వ టెస్టులో సెంచరీ వీరులు వీరే.. మరి కోహ్లీ..?

కోహ్లీ వందో టెస్టు.. ఈ సారైనా సెంచరీ బాదుతాడా?

IND VS SL: శ్రీలంకతో టెస్టు సిరీస్.. ఈ రికార్డులు బ్రేక్ అవుతాయా?

Last Updated : Mar 3, 2022, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.