ETV Bharat / sports

కోహ్లీ ఫామ్​లో లేకపోవడానికి కారణం అది కాదు: ద్రవిడ్​ - టీమ్​ఇండియా వర్సెస్​ ఇంగ్లాండ్​ ఐదో టెస్టు

Kohli Rahul Dravid: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రధాన కోచ్​ రాహుల్ ద్రవిడ్​. ఆటగాడి కెరీర్‌లో భిన్న దశలు ఉంటాయని అన్నాడు. విరాట్​ అంతగా ఫామ్‌లో లేకపోవడానికి కారణం ప్రేరణ కొరవడడమో, బలమైన కోరిక లేకపోవడమో కాదని చెప్పాడు.

Kohli Dravid
కోహ్లీ ద్రవిడ్​
author img

By

Published : Jun 30, 2022, 7:28 AM IST

Updated : Jun 30, 2022, 7:38 AM IST

Kohli Rahul Dravid: కొద్ది కాలంగా టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్​లు ఆడలేకపోతున్నాడు. చివరిసారిగా 2019 నవంబరులో బంగ్లాదేశ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో అతడు శతకం నమోదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. అతడు ఎప్పుడు శతకం బాదుతాడా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు టీమ్​ఇండియా.. ఇంగ్లాండ్​తో ఐదో టెస్టు ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్​లోనైనా అతడు బాగా రాణించాలని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రధాన కోచ్​ ద్రవిడ్​.

"ఆటగాడి కెరీర్‌లో భిన్న దశలు ఉంటాయి. కోహ్లి ప్రస్తుత పరిస్థితికి (అంతగా ఫామ్‌లో లేకపోవడం)కి కారణం ప్రేరణ కొరవడడమో, బలమైన కోరిక లేకపోవడమో కాదు. ఎప్పుడూ సెంచరీ చేస్తేనే బాగా ఆడినట్లు కాదు. కేప్‌టౌన్‌లో క్లిష్ట పరిస్థితుల్లో చేసిన 79 పరుగుల ఇన్నింగ్స్‌ కూడా ఎంతో విలువైందే. కోహ్లి ఎంతటి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాడాంటే.. జనం ఇప్పుడు సెంచరీ కొడితేనే అతడు విజయవంతమైనట్లు భావిస్తారు. ఒక కోచ్‌గా నేనైతే అతడి నుంచి మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శనను కోరుకుంటా. అది 50 పరుగుల ఇన్నింగ్స్‌ కావొచ్చు లేదా 60 పరుగుల ఇన్నింగ్స్‌ కావొచ్చు" అని అన్నాడు.

ఇదీ చూడండి: IND VS ENG: కథ మారింది.. ఎవరెలా ఆడతారో?

Last Updated : Jun 30, 2022, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.