ETV Bharat / sports

టీమ్​ఇండియా ఘోర ప్రదర్శన.. తప్పు పిచ్​దా? - kohli anderson

ఇంగ్లాండ్​తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత క్రికెట్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఆతిథ్య జట్టు బౌలర్లు చక్కని లైన్​ అండ్ లెంగ్త్​తో బంతులు వేయగా, మన బ్యాట్స్​మెన్​ మాత్రం అనవసర షాట్లకు పోయి వికెట్లు సమర్పించుకున్నారు. ఇంతకీ ఇక్కడ తప్పెవరిది? పిచ్​దా లేదా బ్యాట్స్​మెన్​దా?

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Aug 26, 2021, 6:41 AM IST

లార్డ్స్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత.. ఇప్పుడు లీడ్స్‌లో భారత ఆటతీరు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసేదే. నిజానికి పిచ్‌ బ్యాటింగ్‌కు మరీ అంత కష్టంగా ఏమీలేదని భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడే వ్యాఖ్యాతలన్నారు. తర్వాత క్రీజులో నిలబడితే పరుగులు సాధించవచ్చని ఇంగ్లాండ్‌ ఓపెనర్లు చాటారు. భారత్‌ అలా కుప్పకూలిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి.

అందులో ఒకటి క్రమశిక్షణతో సరైన లెంగ్త్‌లో ప్రత్యర్థి బౌలర్లు బౌలింగ్‌ చేయడం.. మరొకటి భారత బ్యాట్స్‌మెన్‌ షాట్ల ఎంపిక. వయసు మీద పడుతున్నా పదును తగ్గని బౌలింగ్‌తో చెలరేగుతున్న 39 ఏళ్ల అండర్సన్‌.. లోపలికి, బయటికి బంతులను స్వింగ్‌ చేస్తూ టాప్‌ఆర్డర్‌ పని పట్టాడు. గత రెండు మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లాడి గొప్ప ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌.. ఈ ఇన్నింగ్స్‌లో మాత్రం నిరాశపరిచాడు. అండర్సన్‌ లైన్‌లో వేసిన బంతిని ఆడాలని ప్రయత్నించి వికెట్‌కీపర్‌ చేతికి చిక్కాడు. ఇక అక్కడి నుంచి అదే దృశ్యం పునరావృతమైంది.

.
.

కొంతకాలంగా పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పుజారా.. మరోసారి విఫలమయ్యాడు. ఇక కెప్టెన్‌ కోహ్లీ మరోసారి తనకు అలవాటైన తప్పిదంతో వికెట్‌ పారేసుకున్నాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల పడ్డ బంతిని వదిలేయకుండా.. దాన్ని వెంటాడి వికెట్‌ సమర్పించుకునే బలహీనతను కొనసాగించాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోవాల్సిన రహానె కూడా బ్యాట్‌ ఎత్తేశాడు. పంత్‌ ఆఫ్‌స్టంప్‌ దాటి పోతున్న బంతిని ఆడి పేలవంగా ఔటయ్యాడు. ఈ అయిదుగురు బ్యాట్స్‌మెన్‌ దాదాపుగా ఒకే రీతిలో వికెట్లు ఇచ్చేయడం ఆందోళన కలిగించే అంశం. ఇన్‌స్వింగ్‌ లేదా అవుట్‌ స్వింగ్‌ బంతులు ఆడి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వీళ్లు పెవిలియన్‌ చేరారు.

ఇక చాలా సేపు క్రీజులో ఓపికగా నిలబడ్డ రోహిత్‌ ఔటైన తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యమైంది కాదు. అప్పటికే జట్టు కఠిన పరిస్థితుల్లో ఉందని అతనికి తెలుసు. కానీ ఇటీవల షార్ట్‌పిచ్‌ బంతులకు ఔటవుతున్న అతను.. ఇప్పుడూ అదే తరహాలో మరోసారి ఔటయ్యాడు.

టెయిలెండర్లు ఎప్పుడో ఒకసారి ఆదుకుంటారేమో కానీ.. ప్రతిసారీ వారి నుంచి పోరాటం ఆశించలేం. వాళ్లను ఎన్నిసార్లు నమ్ముకోగలం? లార్డ్స్‌లో షమి, బుమ్రాల పుణ్యమా అని ఓటమి ముప్పు తప్పించుకుని అద్భుత విజయాన్నందుకున్న భారత్‌.. ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంపై పెద్దగా దృష్టిసారించలేదని ఈ మ్యాచ్‌తో రుజువైంది. బ్రాడ్‌, వుడ్‌ లాంటి ప్రధాన బౌలర్లు దూరమైనప్పటికీ.. భారత్‌ 78 పరుగులకే కుప్పకూలడం ఏమాత్రం జీర్ణించుకోలేని విషయం.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.