Rohit kohli news: కెప్టెన్ రోహిత్‌శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలను దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కొట్టిపారేశాడు.
"కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు ఎందుకొస్తున్నాయో అర్థం కావట్లేదు. వాళ్లిద్దరూ భారత జట్టుకు చాలా ఏళ్లుగా కలిసి ఆడుతున్నారు. వాళ్లిద్దరూ ఎందుకు గొడవపడతారు. కొత్త కెప్టెన్ విజయవంతం కాకూడదని పాత కెప్టెన్ ఎందుకు అనుకుంటాడు. ఏ బ్యాట్స్‌మన్ అయినా పరుగులు చేయకపోయినా.. బౌలర్ వికెట్లు తీయకపోయినా అతడికి జట్టులో చోటు ఉండదు. ఆ ప్రాథమిక విషయం కోహ్లీకి కూడా తెలుసు" అని సన్నీ చెప్పాడు.
మరోవైపు టీమ్‌ఇండియా యువ పేసర్ సిరాజ్ మ్యాచ్ మ్యాచ్‌కు మెరుగవుతున్నాడని.. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఒక్క వికెట్టే తీసినా గొప్పగా బౌలింగ్ చేశాడని గావస్కర్ ప్రశంసించాడు.
"సిరాజ్ మ్యాచ్ మ్యాచ్‌కు మెరుగవుతున్నాడు. బరిలో దిగిన ప్రతిసారీ వందశాతం ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాడతను. ఒక రోజులో తొలి బంతి.. ఆ రోజు ఆఖర్లో వేసే చివరి బంతిని అతడు ఒకే ఉత్సాహంతో వేస్తాడు. ప్రతి కెప్టెన్ చూసేది ఇలాంటి ఆటగాడి కోసమే. సిరాజ్ తెలివిగా బంతులేస్తాడు. విండీస్ తొలి వన్డేలో ఒక వికెట్టే తీసినా గొప్పగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తన కోసం రెండు స్లిప్స్ పెట్టుకున్నాడు. ఒకవేళ బంతి కొంచెం బౌన్స్ అయితే అది క్యాచ్‌గా మారి రెండో స్లిప్‌కు వెళ్లే అవకాశం ఉంటుందనేది అతడి ఆలోచనే. అలాంటి బంతితోనే అతడు వికెట్ తీశాడు. సీనియర్ బౌలర్లు బుమ్రా, షమిలతో బౌలింగ్ చేయడం వల్ల అతడు మరింత మెరుగవుతున్నాడు. సిరాజ్ బంతులేసేటప్పుడు బుమ్రా, షమి మిడాఫ్, మిడాన్‌లో ఉండి అతడికి సలహాలు ఇస్తున్నారు. ఒక యువ బౌలర్‌కు ఇదెంతో కలిసొచ్చే అంశం" అని గావస్కర్ అన్నాడు.
ఇవీ చదవండి: