Surya Wear Samson Jersey : వెస్టిండీస్‌తో మొదటి వన్డేలో టీమ్ఇండియా బ్యాటర్ సూర్య కుమార్.. సంజూ శాంసన్ జెర్సీలో కనిపించాడు. మైదానంలో సడెన్‌గా శాంసన్ జెర్సీని చూసి సుంజూనే వచ్చాడా అనుకున్నారు. కానీ ఆ జెర్సీలో ఉన్న సూర్యను చూసి.. శాంసన్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్కు గురయ్యారు.
మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్యను.. శాంసన్ ఎక్కడా అని అభిమానులు అడిగారు. దీంతో వారి అరుపులకు స్పందించిన సూర్య వారి వైపు తిరిగి.. రెండు చేతులతో హార్ట్ షేప్‌లో శాంసన్ తన గుండెల్లో ఉన్నట్లుగా చూపాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. ఇక సూర్య, శాంసన్ జెర్సీ ఎందుకు ధరించాడో మ్యాచ్ అనంతరం టీమ్ మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది.
అయితే సూర్యకుమార్‌కు అందజేసిన జెర్సీ సైజ్ మారిందట. అతడి సైజ్ జెర్సీ అందుబాటులో లేకపోవడం వల్ల.. సూర్య, శాంసన్ జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చాడని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. అయితే సహచర ఆటగాళ్ల జెర్సీ ధరించడం సూర్యకు కొత్తేమీ కాదు. గతంలో కూడా విండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సూర్య.. పేస్ బౌలర్ అర్షదీప్ సింద్ జెర్సీని ధరించాడు. కాగా ఈ పర్యటనలో టీ20 జట్టుకు ఎంపికైన వారితో సూర్య జెర్సీని పంపించనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ మ్యాచ్‌లో వన్ డౌన్లో వచ్చిన సూర్య.. మొదట్లో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. తర్వాత మూడు ఫోర్లు.. ఓ సిక్స్ బాది టచ్‌లోకి వచ్చాడనుకునేలోపే 19 పరుగులకే ఎల్బీగా పెవిలియన్ చేరాడు. మరోవైపు శాంసన్‌ను కాదని, సూర్యను జట్టులోకి తీసుకోవడం వట్ల నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వన్డేల్లో పదే పదే సూర్య కుమార్ ఫెయిలవుతున్నా.. ఎందుకు అతడికి ఇన్ని ఛాన్స్‌లు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో మండిపడ్డారు.
Ind vs Wi Odi : స్వల్ప లక్ష్యానికే టీమ్ఇండియా ఐదు వికెట్లు కోల్పోవడం వట్ల క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అసలు ఫామ్‌లో లేని విండీస్ జట్టుపైనే ఇంతలా కష్టపడితే.. ప్రపంచకప్‌లో పెద్ద పెద్ద జట్లను ఎలా ఎదుర్కొంటారని ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ 115 పరుగులను ఛేదించేందుకు 22.5 ఓవర్లు ఆడి ఐదు వికెట్లు కోల్పోయింది.