ETV Bharat / sports

ఆసక్తిగా భారత్-పాక్ మ్యాచ్​ ప్రోమో.. మీరు చూశారా? - ఇండియా పాక్​ మ్యాచ్ ప్రోమో

ICC T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్​లో భాగంగా టీమ్​ఇండియా-పాకిస్థాన్​ మధ్య జరగబోయే మ్యాచ్​కు ప్రోమో తాజాగా విడుదలైంది. ఇది ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ నవ్వులు పూయిస్తోంది.

ICC T20 World Cup 2022
ICC T20 World Cup 2022
author img

By

Published : Oct 2, 2022, 4:12 PM IST

ICC T20 World Cup 2022: ఇండియా-పాకిస్థాన్​ మ్యాచ్.. ఇది ఒక ఎమోషన్. ఈ మ్యాచ్​ ఎప్పుడు జరిగినా టీవీలకు అతుక్కుపోవడం భారత క్రికెట్​ అభిమానుల వంతు అవుతుంది. అయితే త్వరలోనే టీ20 ప్రపంచకప్​లో భాగంగా దాయాదుల మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ నెల 23న భారత్​ పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​లో స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్​కు సంబంధించి టికెట్లు అన్నీ అమ్మడైపోయాయి. దాదాపు 90 వేల మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్​కు రానున్నారు. తాజాగా ఈ మ్యాచ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ చిన్నోడు.. 'నేను శర్మాజీ కొడుకు. ఇది దర్ద్‌నాపూర్. ఇక్కడ ఎవ్వరూ దేనికి భయపడరు, బాధపడరు. మేం టీమ్​ఇండియా విజయాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటాం. బలంతో పండగ చేసుకుంటాం. అయితే ఒక్క సంఘటనతో అంతా మారిపోయింది. ఆ రోజు... అందరూ ఏడ్చేశారు. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా.. ఈసారి గెలిచి.. ఇంతకముందు ఓటమిని మరచిపోయేలా చేయండి. ఇన్ని రోజుల ఎదురుచూపులకు ముగింపు చెప్పెండి' అంటూ టీమ్​ఇండియాకు సూచిస్తూ ఆ ప్రోమోలో కనపడ్డాడు.

కాగా, గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్​లో పాకిస్థాన్​ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది టీమ్​ఇండియా. అంతకుముందు ఎప్పుడూ ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టుపై గెలవని పాక్​, అన్నింటికీ కలిపి ఒకేసారి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఇప్పుడు దానికి రివెెంజ్​ తీర్చుకునే ఛాన్స్​ టీమ్​ఇండియాకు వచ్చింది.

ఇక ఈ సంవత్సరం ఇప్పటికే ఆసియాకప్​లో ఇండియా, పాకిస్థాన్​ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఇరు జట్లు చెరో మ్యాచ్​ గెలిచాయి. ఇప్పుడు మూడో సారి ప్రపంచకప్​లో భాగంగా తొలి మ్యాచ్​లో ఆడనున్నాయి. మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.

ఇవీ చదవండి: సాయిపల్లవి మేనత్త స్టార్​ డైరెక్టర్​కు తల్లి అని తెలుసా!?

పెద్దపులితో ప్రియా ప్రకాశ్​ ఆటలు.. దానిపై ఎక్కి, పొడుకుని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.