ETV Bharat / sports

ind vs wi first t20 rohith shama: 'శ్రేయస్​ను అందుకే తుది జట్టులోకి తీసుకోలేదు' - రవి బిష్ణయ్​

IND VS WI first T20 Rohith sharma: వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20లో విజయంపై హర్షం వ్యక్తం చేసిన కెప్టెన్​ రోహిత్​ శర్మ.. ఈ గెలుపు తమ జట్టులో మరింత ధైర్యాన్ని నింపిందని చెప్పాడు. రవిబిష్ణోయ్​ ప్రతిభావంతుడని, అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. తుదిజట్టులోకి శ్రేయస్​ అయ్యర్​ను ఎందుకు తీసుకోలేదో వివరించాడు.

rohit sharma
రోహిత్​ శర్మ
author img

By

Published : Feb 17, 2022, 11:28 AM IST

IND VS WI first T20 Rohith sharma: వెస్టిండీస్​తో జరిగిన తొలి టీ20లో విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు కెప్టెన్​ రోహిత్ శర్మ. ఈ విజయం తమలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పాడు. ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడిచేయడంలో బౌలర్లు మంచి ప్రదర్శన చేశారని కొనియాడాడు. బ్యాటింగ్​లో ఇంకాస్త బాగా రాణించి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు.

ఆటను కొంచెం త్వరగా ముగిస్తే బాగుండేది. ఈ విజయం మాకు ఎంతో సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కట్టడి చేయడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్​ విషయంలో కాస్త వెనకబడ్డాం దానిపై దృష్టి పెట్టాలి.

బిష్ణోయ్​ అద్భుతమైన ప్రతిభ గల ఆటగాడు..

బిష్ణోయ్​ ఎంతో ప్రతిభ కలిగిన ఆటగాడు అందుకే నేరుగా జట్టులోకి తీసుకున్నాం. అతనిలో అనేక రకాల నైపుణ్యాలు ఉన్నాయి. మ్యాచ్​ ఏ దశలోనైనా బౌలింగ్​ చేయగల సత్తా అతనికి ఉంది. మిగిలిన బౌలర్లను మార్చడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అతని మెుదటి అంతర్జాతీయ మ్యాచ్ ప్రదర్శన​ చాలా సంతోషాన్నిచ్చింది. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.

జట్టుకు ఏది ముఖ్యమో ఆటగాళ్లకు తెలుసు..

శ్రేయస్ అయ్యర్​ లాంటి ఆటగాడిని జట్టులోకి తీసుకోకపోవడం కష్టంగా ఉంటుంది. మిడిల్​ ఓవర్లలో బౌలింగ్​ వేసే వారికోసం చూశాం. అందుకే అతన్ని తీసుకోలేదు. జట్టులో ప్రతిభ కలిగిన ఆటగాళ్ల మధ్య ఇలాంటి పోటీ ఉండడం సంతోషించదగ్గ విషయం. ఇందులో నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయడం నాకు చాలా కష్టమైన ఆంశం. ప్రపంచకప్​కు ఎంపిక చేస్తామని శ్రేయస్​కు స్పష్టంగా చెప్పాం. ప్రతి ఆటగాడు జట్టకు ఏది అవసరమో అది చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవర్ని జట్టులోకి తీసుకోకపోయినా బాధ పడకుండా, దానికి గల కారణాన్ని అర్థం చేసుకోగలరు. అనేక సంప్రదింపుల తర్వాతే ఇలాంటి వాటిపై నిర్ణయం తీసుకుంటాం. జట్టుకు అవసరమైన ప్రతిసారి రాణించాలని చెబుతాం.

ఒత్తిడి లేకుండా చేయడమే తమ లక్ష్యం..

ఇషాన్​ కిషన్​తో చాలా ఏళ్లుగా మాట్లాడుతున్నా. అతను ముంబై ఇండియన్స్​లో ఆడేటప్పుడు తన స్థానం కాని మిడిల్​ ఆర్డర్​లో ఆడేవాడు. చెన్నై లాంటి పిచ్​లు​ స్లోగా ఉండటం వల్ల అతడు రాణించలేకపోయేవాడు. నీవు రాణించగలవని అతడిలో ఆత్మవిశ్వసాన్ని నింపాం. ఇండియా తరఫున ఆడేటప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. దానిని పోగొట్టి అతడిని సౌకర్యంగా ఉంచడమే మా లక్ష్యం.

-రోహిత్ శర్మ

వెస్టిండీస్​తో జరిగిన మొదటి టీ20లో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ చేసిన విండీస్​ 157 పరుగులు చేయగా, భారత్​ 18.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ 40 పరుగులతో రాణించగా, భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు.

ఇండియా, వెస్టిండీస్​ మధ్య రెండో టీట్వంటీ శుక్రవారం జరగనుంది.

ఇదీ చదవండి: IND VS WI: మూడో టీ20కు అభిమానులకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.