Rinku Singh Finisher : టీమ్ఇండియా క్రికెటర్ రింకూ సింగ్‌కు ఈ సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అతడి ప్రతిభకు తోడు అవకాశాలు కూడా వస్తుండడం వల్ల రింకూను ప్రపంచం గుర్తిస్తోంది. అటు ఐపీఎల్లో, ఇటు టీమ్ఇండియా తరఫున ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడుతూ.. అవకాశాలను ఏ మాత్రం చేజార్చుకోకుండా రెండు చతులా అందిపుచ్చుకుంటున్నాడు.
రీసెంట్గా విశాఖపట్టణం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ రింకూ.. టీమ్ఇండియాకు మంచి ఫినిషింగ్ ఇచ్చి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో రింకూ లేకపోతే గెలుపు సాధ్యమయ్యేది కాదని పలువురి నుంచి అభిప్రాయాలు కూడా వచ్చాయి. ధోనీ తర్వాత టీమ్ఇండియాకు అంతటి బెస్ట్ ఫినిషర్‌గా రింకూ ఎదుగుతాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రింకూ కెరీర్ తొలి నాళ్లలో అతడి ప్రతిభను గుర్తించింది.. కోచ్ అభిషేక్ నాయరేని , దినేశ్ కార్తిక్ అన్నాడు.
-
Rinku Singh Finisher 🔥
— Santhosh ⚡ (@SanthoshAK_1991) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Well done Team india#INDvAUS pic.twitter.com/74yY7EyYsJ
">Rinku Singh Finisher 🔥
— Santhosh ⚡ (@SanthoshAK_1991) November 23, 2023
Well done Team india#INDvAUS pic.twitter.com/74yY7EyYsJRinku Singh Finisher 🔥
— Santhosh ⚡ (@SanthoshAK_1991) November 23, 2023
Well done Team india#INDvAUS pic.twitter.com/74yY7EyYsJ
"2018 ఐపీఎల్లో రింకూ కోల్‌కతాకు ఆడుతున్నప్పుడు.. రింకూలో సత్తా ఉందని అభిషేక్ గుర్తించాడు. భవిష్యత్‌లో అతడు అదరగొడతాడని నమ్మి.. రింకూను డెత్ ఓవర్లలో ఆడే విధంగా సానబట్టాడు. లీగ్‌లో అతడికి గాయమైనా.. జట్టుతోనే ఉండేలా కో ఓనర్ వెంకీ మైసోర్‌తో మాట్లాడి ఒప్పించాడు. ఆసీస్‌తో గెలుపు తర్వాత రింకూ.. తన కోచ్ అభిషేక్‌ను హగ్ చేసుకోవడం ఆనందంగా అనిపించింది" అని కార్తిక్ అన్నాడు.
ధోనీ నుంచే నేర్చుకున్నా.. "టార్గెట్ ఛేదించేటప్పుడు, డెత్ ఓవర్లలో ఎలా ప్రశాంతంగా ఉండాలో ధోనీతో ఓసారి చర్చించాను. వీలైనంత వరకు కూల్‌గా ఉంటూ.. బౌలర్ వైపే సూటిగా చూడాలని ధోని చెప్పాడు. క్రీజులో దేనికీ రియాక్ట్ అవ్వకుండా.. నేను అదే ఫాలో అవుతున్నాను. అదే నాకు ఎంతో ఉపయోగపడుతోంది" అని అన్నాడు.
Rinku Singh IPL 2023 : ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్‌పై వరుసగా 5 సిక్స్‌లు బాది.. వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తూ.. రింకూ నిలకగా ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో 59.25 సగటుతో 474 పరుగులు చేశాడు. ఇందులో నాలుగుసార్లు 50+ స్కోర్లు చేశాడు. ఈ ఐపీఎల్లో ప్రదర్శనే అతడిని టీమ్ఇండియాలోకి తీసుకొచ్చింది. ఇక టీమ్ఇండియా తరఫున రింకూ.. 3 ఇన్నింగ్స్‌ల్లో 97 పరుగులు చేశాడు.
-
Rinku Singh- New Finisher of Team India🔥🔥#indvsaust20 #INDvsAUS #RanbirKapoor #Virat #TeamIndia #SuryaKumarYadav #IshanKishan #Inglis #Australia pic.twitter.com/pKZwYPqRBz
— Ankit Khanna (@ankit_khanna) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rinku Singh- New Finisher of Team India🔥🔥#indvsaust20 #INDvsAUS #RanbirKapoor #Virat #TeamIndia #SuryaKumarYadav #IshanKishan #Inglis #Australia pic.twitter.com/pKZwYPqRBz
— Ankit Khanna (@ankit_khanna) November 23, 2023Rinku Singh- New Finisher of Team India🔥🔥#indvsaust20 #INDvsAUS #RanbirKapoor #Virat #TeamIndia #SuryaKumarYadav #IshanKishan #Inglis #Australia pic.twitter.com/pKZwYPqRBz
— Ankit Khanna (@ankit_khanna) November 23, 2023
-
The Finisher Rinku Singh is here to rule for India. 💪#RinkuSingh #icc #teamindia #indvsaust20 pic.twitter.com/vtuPoCanbc
— FirstSportz Cricket (@firstsportzcric) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Finisher Rinku Singh is here to rule for India. 💪#RinkuSingh #icc #teamindia #indvsaust20 pic.twitter.com/vtuPoCanbc
— FirstSportz Cricket (@firstsportzcric) November 24, 2023The Finisher Rinku Singh is here to rule for India. 💪#RinkuSingh #icc #teamindia #indvsaust20 pic.twitter.com/vtuPoCanbc
— FirstSportz Cricket (@firstsportzcric) November 24, 2023
రింకూ సింగ్ సిక్సర్ల వర్షం, మెరుపు ఇన్నింగ్స్ వీడియో చూశారా?