ETV Bharat / sports

అయ్యో పాపం.. ఈ ప్లేయర్​ అన్నీ గోల్డెన్​ డకౌట్లే

ఆసక్తిగా సాగిన ఆసియాకప్​ 2022 ఆదివారంతో ముగిసింది. అయితే ఫైనల్​ మ్యాచ్​కు సంబంధించి ఓ పాకిస్థాన్​ ప్లేయర్​పై నెట్టింట్లో ఫన్నీ మీమ్స్​ ట్రోలింగ్​ అవుతున్నాయి. ఎందుకంటే..

Fakhar Zamant
Pakisthan player Fakhar Zaman five golden ducks
author img

By

Published : Sep 12, 2022, 5:17 PM IST

ఆసియాకప్‌ 2022 ఫైనల్​లో పాకిస్థాన్​ను ఓడించి ఛాంపియన్​గా అవతరించింది శ్రీలంక. అదివారం దుబాయ్‌ వేదికగా జరిగిన తుదిపోరులో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. పాకిస్థాన్​ జట్టు మొదటి నుంచి మంచి ప్రదర్శనే చేసింది. విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. అయితే ఇప్పుడు ఆ జట్టు బ్యాటర్​ ఫకర్ జమాన్​పై సోషల్​ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆసియా కప్​ ఫైనలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ డక్​ ఔట్​ అయ్యాడు. డక్​ ఔట్​ అవడం మామూలే.. దీనిపై చర్చ ఎందుకు అంటారా? దీనికి కారణం మరొకటి ఉంది.
అదేమిటంటే.. ఫకర్​ జమాన్​ ఆసియా కప్​ ఫైనల్​తో పాటు ఐదు సార్లు డక్​ ఔట్​ అయ్యాడు. అవి మామూలు డక్​ ఔట్లు కాదు. గోల్డెన్ డక్​ ఔట్లు. అంటే ఫీల్డ్​లో దిగిన మొదటి బంతికే పెవీలియన్ చేరడం అన్నమాట. అయితే ఇందులో మరో విశేషం ఉంది. ఈ డక్​ ఔట్​లు అన్నీ టీ20 ఫార్మాట్​లోనే జరిగాయి.

2019లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్​లో మొదటి సారిగా గోడ్డెన్ డక్​ ఔట్​ అయ్యాడు ఫకర్​ జమాన్​. అదే సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లోనూ ఈ విధంగానే ఔట్​ అయ్యాడు. 2021లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో మరో సారి అదే తీరు కొనసాగింది. ఇక ప్రస్తుత సంవత్సరంలోనూ ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన మ్యాచ్​ల్లో గోల్డెన్​ డకౌట్​గా వెనుదిరిగాడు. దీంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పాకిస్థాన్​ గోల్డెన్​ ప్లేయర్​ అని కొందరు అంటుంటే.. అయిదు బాతు గుడ్లు ఉన్నాయి.. రెండు రోజులు హాయిగా తినొచ్చు అని సరదాగా కమెంట్లు చేస్తున్నారు.

ఓటమికి పూర్తి బాధ్యత నాదే..
ఆసియా కప్‌ ఫైనల్‌ పోరులో పాకిస్థాన్‌ 23 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక జట్టు ఆరోసారి ఆసియా కప్‌ను అందుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓ కీలకమైన క్యాచ్‌ను పాక్‌ ఫీల్డర్లు ఢీకొని నేలపాలు చేయడం శ్రీలంకకు కలిసొచ్చింది. క్యాచ్‌ను జారవిడవడమే కాదు.. ఏకంగా ఆరు పరుగులు సమర్పించుకున్నారు కూడా. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయిన లంక జట్టులో రాజపక్స మినహా ఇక మిగిలింది బౌలర్లు మాత్రమే. అలాంటి కీలక సమయంలో రాజపక్స ఇచ్చిన ఆ క్యాచ్‌ను జారవిడవడంతో పాక్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ క్యాచ్‌ను జారవిడిచినవారిలో ఒకరైన వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ స్పందించాడు. మ్యాచ్‌ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో షాదాబ్‌ రెండు క్యాచ్‌లను విడిచిపెట్టాడు.

మ్యాచ్‌ అనంతరం ట్వీట్‌ చేస్తూ.. 'క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి. ఈ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నా. నేను నా బృందాన్ని నిరాశపరిచాను' అంటూ పేర్కొన్నాడు. జట్టు మొత్తం శాయశక్తులా ప్రయత్నించిందని.. నసీమ్‌ షా, హారిస్‌ రౌఫ్‌, నవాజ్‌ త్రయం అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. మహ్మద్‌ రిజ్వాన్‌ గొప్పగా పోరాడాడని ప్రశంసించాడు. కప్‌ సాధించిన శ్రీలంక జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

18.6వ ఓవర్‌లో మహమ్మద్‌ హస్నైన్‌ వేసిన బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. గాల్లో ఉన్న ఈ బంతిని అందుకొనేందుకు అక్కడే ఉన్న అసిఫ్‌ అలీ ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో షాదాబ్‌ ఖాన్‌ గుడ్డిగా ఆ దిశగా పరిగెత్తుకొంటూ వచ్చి అలీను ఢీకొన్నాడు. అప్పటికే అలీ చేతికందిన బంతి.. షాదాబ్‌ ఢీకొనడంతో బౌండరీ లైన్‌ బయటపడింది. ఫలితంగా వికెట్‌ కోల్పోవాల్సిన శ్రీలంకకు సిక్సర్‌ లభించింది. అప్పటికే జోరుమీదున్న రాజపక్స చివరి ఓవర్లో 14 పరుగులు సాధించాడు.

ఇవీ చదవండి: ఆ ప్లేయర్​తో భారత మహిళా క్రికెటర్ ఎంగేజ్​మెంట్​.. త్వరలోనే పెళ్లి

Asiacup 2022: ఛాంపియన్​ శ్రీలంకకు ప్రైజ్​మనీ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.