ODI WorldCup 2023 Aus VS Ind : వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ విరాట్ కోహ్లీ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 3 ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. అతడి బంతి ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లగా.. సెకెండ్ స్లిప్‌లో ఉన్న విరాట్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మార్ష్ షాక్ అయిపోయాడు. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
World Cup Kohli Catches : అలాగే విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక క్యాచ్‌లు(వికెట్ కీపర్ కాకుండా) పట్టిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. మిచిల్ మార్ష్ క్యాచ్‌ను అందుకున్న కోహ్లీ.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్ టోర్నీల్లో కోహ్లీ 15 క్యాచ్‌లను పట్టుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(14) పేరిట ఉండేది. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును విరాట్ అధిగమించాడు. మాజీ దిగ్గజ క్రికెటర్స్ కపిల్ దేవ్, సచిన్(12) క్యాచులు అందుకున్నారు.
-
What a catch by Virat Kohli😲
— Abhishek (@Abhik_world) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Dangerous #MitchellMarsh gone for duck 🦆
Well bowled #Bumrah#INDvsAUS pic.twitter.com/3jzEa1lau9
">What a catch by Virat Kohli😲
— Abhishek (@Abhik_world) October 8, 2023
Dangerous #MitchellMarsh gone for duck 🦆
Well bowled #Bumrah#INDvsAUS pic.twitter.com/3jzEa1lau9What a catch by Virat Kohli😲
— Abhishek (@Abhik_world) October 8, 2023
Dangerous #MitchellMarsh gone for duck 🦆
Well bowled #Bumrah#INDvsAUS pic.twitter.com/3jzEa1lau9
Warner 1000 runs in WorldCup : వార్నర్ సరికొత్త రికార్డ్.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా దిగ్గజం సచిన్ తెందుల్కర్, దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు.
ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయాక.. స్టీవ్ స్మిత్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా కొనసాగుతున్న వార్నర్ ఏడో ఓవర్ రెండో బాల్‌కు ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ బాది వన్డే ప్రపంచకప్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో సచిన్ తెందుల్కర్, ఏబీ డివిలియర్స్ 20 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డ్‌ను అందుకోగా.. విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, గంగూలీ 21, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా, సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ హర్షల్ గిబ్స్ 22 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్‌ను చేరుకున్నారు.
Ind vs Aus World Cup 2023 : భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్.. ఇషాన్ ఇన్.. గిల్ ఔట్