ETV Bharat / sports

MS Dhoni Jersey No: నా లక్కీ నంబర్ 7​ కాదు: ధోనీ - ms dhoni news

MS Dhoni Jersey No: తన జెర్సీ నంబర్ ఎంపికకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు భారత మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్ ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో ముచ్చటించిన ధోనీ.. దీనికి గల కారణాన్ని వారితో పంచుకున్నాడు.

MS Dhoni
మహేంద్రసింగ్ ధోనీ
author img

By

Published : Mar 18, 2022, 12:18 PM IST

MS Dhoni Jersey No:జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్టమైన సంఖ్య ఉంటుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి కూడా ఉంది.‌ అదే నంబర్‌ 7. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతడు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టిన నాటి నుంచి.. ఇప్పటికీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున కూడా అదే నంబర్‌తో ఆడుతున్నాడు. అయితే, ధోనీకి నంబర్‌ 7 ఎందుకు ఇష్టం అనేది మాత్రం చాలా మందికి తెలియదు. అందరూ అది అతడి లక్కీ నంబర్‌ అని అనుకుంటారు. కానీ, అలాంటిదేమీ కాదని మహీనే వెల్లడించాడు. దానికి ఓ చిన్న కారణం ఉందన్నాడు. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ అభిమానులతో నిర్వహించిన ఓ సమావేశంలో ధోనీ పాల్గొని ముచ్చటించాడు. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన నంబర్‌ 7 పై వివరణ ఇచ్చాడు.

'మొదట్లో చాలా మంది అది నా లక్కీ నంబర్‌ అనుకున్నారు. కానీ, అలా కాదు. ఓ చిన్న కారణం చేతనే నేను 7 నంబర్‌ని ఎంపిక చేసుకున్నా. నేను పుట్టిన తేది జులై 7. అంటే అది ఏడో నెల ఏడో తారీఖు. అందుకే దాన్ని ఎంపిక చేసుకున్నా. నాకు ఏ సంఖ్య కలిసివస్తుందనే విషయంలో అవీ ఇవీ ఆలోచించకుండా పుట్టిన తేదీనే తీసుకోవాలనుకున్నా. అలాగే ఎవరైనా నన్ను 7 ఎందుకు ఇష్టమని అడిగితే.. నేను పుట్టింది 81వ సంవత్సరంలో కాబట్టి.. 8 నుంచి 1ని తీస్తే 7 వస్తుందని చెప్పేవాడిని. దాంతో చాలా మంది 7 అనేది న్యూట్రల్‌ నంబర్‌ అని, దానివల్ల చెడు కానీ, మంచి కానీ పెద్దగా ప్రభావం చూపవని చెప్పారు. దీంతో నేను కూడా అలాగే వేరేవాళ్లకి చెప్పేవాడిని. అయితే, ఈ విషయంలో నేనేమీ మూఢ నమ్మకంతో ఉండను. ఆ సంఖ్య నా మనసుకు నచ్చింది కాబట్టే దాన్నే ఫాలో అవుతున్నా' అని మహీ స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి: 'కోహ్లీకి ఇక ఏ ఒత్తిడి లేదు.. ప్రత్యర్థి జట్లకు కష్టమే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.