Siraj Diving Catch : డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా భారత్-వెస్టిండీస్ తొలి టెస్టు ప్రారంభమైంది. ఆట తొలిరోజే విండీస్ ఆటగాళ్లను కట్టడి చేసింది రోహిత్ సేన..తమదైన స్టైల్లో ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ పట్టిన డైవింగ్ క్యాచ్.. అందరి చేత ఔరా అనిపిస్తోంది. గాల్లోకి ఎగిరి మరి అతను ఈ క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవ్వగా..దీన్ని చూసిన నెటిజన్స్ సిరాజ్ ఫీల్డింగ్‌ను మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారు.
Mohammed Siraj Catch : విండీస్ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా వేసిన 28వ ఓవర్‌లో వెస్టిండీస్ బ్యాటర్ బ్లాక్‌వుడ్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో లాంగ్ మిడాఫ్ లెంత్‌లో తను ఫీల్డింగ్ చేస్తున్న వైపుకు వస్తున్న బంతిని గమనించిన సిరాజ్.. గాల్లోకి ఎగిరి మరి ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు. దీంతో బ్లాక్‌వుడ్ కేవలం 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో సిరాజ్ మోచేయి బలంగా నేలకు తాకడం వల్ల కాస్త ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. క్యాచ్ పట్టగానే కొన్ని క్షణాలు సిరాజ్ మైదానంలో అలానే వాలిపోయాడు. తోటి ఆటగాళ్లు దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పడం వల్ల మళ్లీ తిరిగి ఆటలోకి దిగి బౌలింగ్ వేశాడు. అనంతరం కీలక బ్యాటర్ హోల్డర్ వికెట్‌ను తీశాడు. ఈ వికెట్‌తో ఫస్ట్ సెషన్ ముగియగా.. వెస్టిండీస్ 68/4తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
-
Miyaan Bhai ki daring 😯 #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/LUdvAmmbVr
— FanCode (@FanCode) July 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Miyaan Bhai ki daring 😯 #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/LUdvAmmbVr
— FanCode (@FanCode) July 12, 2023Miyaan Bhai ki daring 😯 #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/LUdvAmmbVr
— FanCode (@FanCode) July 12, 2023
బుధవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను ఆదిలోనే కట్టడి చేశారు భారత బౌలర్లు. కీలక వికెట్స్ తీస్తూ ప్రమాదకర బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చారు. త్యాగ్ నారాయణ్ చందర్‌పాల్ (12), క్రైగ్ బ్రాత్‌వైట్ (20), రేమాన్ రీఫర్ (2)లు త్వరగా వెనుదిరిగారు.
అరంగేట్ర ఆటగాళ్లు..
West Indies vs India : ఈ సిరీస్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేసిన విండీస్ ప్లేయర్ అలీక్ ఇథనోజ్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్‌తో కలిసి జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌తో ఇషాన్ కిషన్, యశస్వీ జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. విరాట్ కోహ్లీ చేతుల మీదుగా ఇషాన్ కిషన్.. కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా యశస్వీ జైస్వాల్ అరంగేట్ర క్యాప్‌లు అందుకున్నారు.