ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు ముందు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్. అతడిని దుబాయ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చగా.. రెండు రోజులపాటు ఐసీయూలో చికిత్స అందించారు వైద్యులు. మ్యాచ్‌లోపు ఫిట్‌గా మారి మళ్లీ బరిలో దిగాడు రిజ్వాన్. అలాగే సెమీస్‌లో హాఫ్ సెంచరీతో అలరించి పాక్ మంచి స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
భారతీయ డాక్టర్ సాయంతో
ఆ ఆస్పత్రిలో రిజ్వాన్‌కు ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు ఓ భారతీయుడు. ఆయన పేరు సహీర్ సైనలబ్దీన్. దీంతో ఆసీస్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం ఆ డాక్టర్‌ను కలిసిన రిజ్వాన్.. అతడికి తన జెర్సీని బహుమతిగా అందించాడు. మ్యాచ్ సమయానికి అతడిని ఫిట్‌గా తయారు చేసినందుకు ఆ వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు రిజ్వాన్. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు డాక్టర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరారు పాక్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, రిజ్వాన్. మాలిక్ సమస్య చిన్నదే అయినా.. రిజ్వాన్ సమస్యను తీవ్రంగా పరిగణించిన వైద్యులు అతడిని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అనంతరం కోలుకుని మ్యాచ్‌లో బరిలో దిగిన రిజ్వాన్ ఓపెనర్‌గా వచ్చి 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు.