ETV Bharat / sports

IPL 2023: కోట్లలో ఖర్చు.. మరి ఫ్రాంఛైజీలకు ఆదాయం ఎలా వస్తుంది? - ఐపీఎల్​ 2023 అప్డేట్లు వార్లు

క్రికెట్​ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్​ 16వ సీజన్​ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌‌తో బీసీసీఐకి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. మరి ఫ్రాంఛైజీలకు ఏమైనా ప్రయోజనం ఉందా? వారికి ఉన్న ఆదాయ మార్గాలు ఏంటి? ఐపీఎల్‌తో 10 ఫ్రాంఛైజీలకు లాభామా? నష్టమా? అన్న విషయాలు తెలుసుకుందాం రండి..

ipl 2023 how franchises got money here is the details

author img

By

Published : Mar 19, 2023, 12:56 PM IST

ప్రపంచ క్రికెట్​ చరిత్రలో ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​.. ఓ సరికొత్త విప్లవం. యావత్​ క్రికెట్​ ప్రపంచం ముందు బీసీసీఐని క్రికెట్​ పెద్దన్నగా నిలిపింది. ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ లీగ్.. ఏటా కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచ క్రికెట్​ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తమ జాతీయ జట్లను కాదని స్టార్ ప్లేయర్లంతా భారత్‌కు క్యూ కట్టేంత పాపులారిటీ సంపాదించుకుంది​. అంతే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందింది. ఎంతో మంది ఆటగాళ్లు ఐపీఎల్‌తోనే రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసింది. ఎనిమిది ఫ్రాంచైజీలతో మొదలైన ఐపీఎల్‌.. గతేడాదే పది జట్లకు విస్తరించింది. ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌‌తో బీసీసీఐకి కోట్ల ఆదాయం వస్తోంది. మరి ఫ్రాంచైజీలకు ఏమైనా ప్రయోజనం ఉందా? వారికి ఉన్న ఆదాయ మార్గాలు ఏంటి? ఐపీఎల్‌తో 10 ఫ్రాంచైజీలకు లాభామా? నష్టమా?

మీడియా హక్కుల ద్వారానే..
కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న ఐపీఎల్​లో ఫ్రాంఛైజీలకు లాభం కూడా అలానే ఉంటుంది. మీడియా హక్కుల ద్వారానే ఫ్రాంఛైజీలకు అత్యధిక ఆదాయం వస్తుంది. మొత్తం ఆదాయంలో 60 నుంచి 70 శాతం మీడియా హక్కుల ద్వారానే లభిస్తుంది. అయితే ఈ సీజన్​ బ్రాడ్​ కాస్టింగ్​ రైట్స్​ను నాలుగు విభాగాలుగా విభజించగా.. బీసీసీఐకు రూ.48,390.52 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. టీవీ హక్కులను స్టార్ నెట్‌వర్క్ రూ.23,575 కోట్లకు దక్కించుకుంది. డిజిటల్ రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయోకామ్ సంస్థ రూ.23,773 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ లెక్కన బీసీసీఐకి ప్ర‌తీ ఏడాది మీడియా రైట్స్ ద్వారా సుమారు ‌రూ.9,670 కోట్ల ఆదాయం వ‌స్తుంది. ఈ వ‌చ్చిన ఆదాయాన్ని 50 శాతం బీసీసీఐకి, 45 శాతం ఫ్రాంచైజీల‌కు, 5 శాతం ప్రైజ్ మ‌నీ కింద విభ‌జిస్తారు.

టైటిల్ స్పాన్స‌ర్‌షిప్ ద్వారా..
మీడియా హ‌క్కుల‌తో పాటు టైటిల్ స్పాన్సర్‌షిప్ ద్వారా కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీల‌కు ఆదాయం లభిస్తుంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన టైటిల్ స్పాన్సర్‌ హక్కులను టాటా సంస్థ రూ. 439.8 కోట్లకు దక్కించుకుంది. ఈ ఆదాయాన్ని కూడా బీసీసీఐ ఫ్రాంఛైజీలకు పంచనుంది. ఇవి కాకుండా ప్ర‌తి ఫ్రాంఛైజీకి కొంత‌మంది ప్రత్యేక స్పాన్స‌ర్లు ఉంటారు. ఆట‌గాళ్లు ధ‌రించే జెర్సీలపై ఆ స్పాన్స‌ర్ల పేర్లు క‌నిపిస్తుంటాయి. ఇలా త‌మ కంపెనీల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డం కోసం స్పాన్స‌ర్లు ఫ్రాంచైజీల‌తో ఒప్పందం చేసుకుంటాయి.

నో కొవిడ్.. ఈ సారి గేట్ రెవెన్యూ కూడా
క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గత మూడేళ్లు పరిమిత వేదికలు, బయో బబుల్ నిబంధనల మధ్య ఐపీఎల్ జరగ్గా.. ఫ్రాంచైజీలకు గేట్ రెవెన్యూ లేకుండా పోయింది. గత రెండు సీజన్లలో పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించినా చెప్పుకోదగ్గ ఆదాయం అయితే రాలేదు. కానీ ఈసారి హోమ్ అండ్ ఎవే పద్దతిలో జట్లు తలపడనున్నాయి. సొంత మైదానాల్లో ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆ మ్యాచ్ టికెట్ల ధ‌ర‌లు నిర్ణయించే అధికారం ఆయా ఫ్రాంఛైజీలకే ఉంటాయి. స్టేడియం ఖర్చులో పోను.. గేట్ రెవెన్యూ ద్వారా ఫ్రాంచైజీల‌కు ఏటా రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్ల వ‌ర‌కు ఆదాయం స‌మ‌కూరుతుంది.

ప్రైజ్ మ‌నీ, జెర్సీల అమ్మకం ద్వారా
ప్రైజ్ మ‌నీ ద్వారా కూడా ఫ్రాంచైజీలు ఆదాయాన్ని పొందుతాయి. సాధార‌ణంగా ప్ర‌తి సీజ‌న్‌లోనూ టైటిల్ గెలిచిన జ‌ట్టుకు రూ.20 కోట్లు, ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన జ‌ట్టుకు రూ.12.5 కోట్ల ప్రైజ్ మ‌నీ అందుతుంది. అంతేకాకుండా ఆట‌గాళ్లను మార్చుకోవ‌డం, త‌మ బ్రాండ్ టీ ష‌ర్టులు, క్యాప్‌లు, ఇత‌ర ఆట వ‌స్తువులను విక్ర‌యించడం ద్వారా కూడా ఫ్రాంచైజీలు ఆదాయం ఆర్జిస్తాయి.

ఖర్చు కూడా అంతే..
ఆదాయంతో పాటు ఖ‌ర్చు కూడా ఫ్రాంఛైజీల‌కు ఎక్కువే ఉంటుంది. ప్రతి ఫ్రాంఛైజీ.. తమ ఫైనల్ బిడ్ మొత్తంలో ఏటా పది శాతాన్ని ఐపీఎల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. 35-45 శాతం వరకు ఆటగాళ్ల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి అనేక విధాలుగా.. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.