సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ అనంతరం పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ మాట్లాడుతూ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని యువ ఆటగాళ్లు తనను టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ కావొద్దని కోరుతున్నారని తెలిపాడు.
"నాకు మా జట్టుపై పూర్తి నమ్మకం ఉంది. మాకు ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారు. పరిస్థితులను బట్టి స్పిన్నర్లను మార్చాల్సి ఉంటుంది. మన్దీప్ సింగ్ అద్భుతంగా ఆడుతున్నాడు. జట్టులోని యువ ఆటగాళ్లు నన్ను టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ కావొద్దని కోరుతున్నారు"
-క్రిస్ గేల్, పంజాబ్ జట్టు
సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నిర్దేశించిన 150పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది పంజాబ్ జట్టు. మన్దీప్ సింగ్(66), క్రిస్ గేల్(51) అద్భుత ప్రదర్శన కనబర్చారు.