ETV Bharat / sports

శాంసన్​ను ధోనీతో పోల్చొద్దు.. శశిథరూర్​కు గంభీర్ కౌంటర్ - సంజూ శాంసన్ శ్రీశాంత్ వార్తలు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో యువ ఆటగాడు సంజూ శాంసన్​ అద్భుతంగా రాణించి రాజస్థాన్ రాయల్స్​కు విజయాన్ని అందించాడు. జట్టు రికార్డు ఛేదనలో కీలకపాత్ర పోషించాడు. ఇతడి ప్రదర్శనను మెచ్చుకుంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంజూను అభినందించారు. అతడిని ధోనీతో పోల్చారు. అయితే థరూర్ వ్యాఖ్యల్ని వ్యతిరేకించారు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్.

Sanju
శాంసన్
author img

By

Published : Sep 28, 2020, 1:09 PM IST

కళ్లు చెదిరే సిక్సర్లతో షార్జాలో వరుసగా రెండో అర్ధశతకం బాదిన సంజూ శాంసన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్య ఛేదనలో అతడి బ్యాటింగ్‌ను అందరూ కీర్తిస్తున్నారు. రాజస్థాన్‌ సారథి స్టీవ్‌స్మిత్‌ నుంచి మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఈ యువ క్రికెటర్‌ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు.

లీగ్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్యమైన 224 పరుగుల్ని రాజస్థాన్‌ ఛేదించిందంటే అది సంజూ వల్లే. అద్భుతంగా ఆడుతున్న అతడిని అందరూ ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా అతడిని అభినందించారు. భారత క్రికెట్లో తర్వాతి ధోనీ అవుతాడని అతడికి ఎప్పుడో చెప్పానని ట్వీట్‌ చేశారు.

  • What an absolutely incredible win for @rajasthanroyals ! I’ve known @iamSanjuSamson for a decade & told him when he was 14 that he would one day be the next MS Dhoni. Well, that day is here. After his two amazing innings in this IPL you know a world class player has arrived.

    — Shashi Tharoor (@ShashiTharoor) September 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రాజస్థాన్‌కు ఇది తిరుగులేని విజయం. దశాబ్ద కాలంగా సంజూ శాంసన్‌ నాకు తెలుసు. ఏదో ఒకరోజు తర్వాతి ధోనీగా నువ్వు అవతరిస్తావని 14 ఏళ్లప్పుడే అతడికి చెప్పా. ఆ రోజు ఇప్పుడొచ్చింది. లీగ్‌లో రెండు అద్భుత అర్ధశతకాల తర్వాత ఓ ప్రపంచస్థాయి ఆటగాడు వచ్చాడని మీ అందరికీ తెలిసింది."

-శశిథరూర్‌ ట్వీట్‌

కాగా థరూర్ అభిప్రాయంతో మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌తో పాటు శ్రీశాంత్ ఏకీభవించలేదు. "మరొకరిలా అవ్వాల్సిన అవసరం శాంసన్‌కు లేదు. అతనెప్పుడూ భారత క్రికెట్లో సంజూ శాంసన్‌గానే ఉండాలి" అని గౌతీ అన్నారు.

"ఈ రెండు మ్యాచ్​లే కాదు భవిష్యత్​లో శాంసన్ మరింతగా రాణించగలడు. ఎన్నో రికార్డులను అధిగమించగలడు. అందువల్ల సంజూను మరొకరితో పోల్చవద్దు. అతడి ఉత్తమ ప్రదర్శన ఇంకా బయటకు రావాల్సి ఉంది" అని శ్రీశాంత్ తెలిపాడు.

ఈ సీజన్‌లో సంజూ ఇప్పటికే 159 పరుగులు చేశాడు. పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఏకంగా 16 సిక్సర్లు, 5 బౌండరీలు బాదాడు. ఈ సీజన్‌లో ఇన్ని సిక్సర్లు ఇప్పటి వరకు ఎవరూ కొట్టలేదు. ఇక ఆదివారం పంజాబ్‌పై అతడు చెలరేగిన తీరు చూసిన అభిమానులు ఈ ఫామ్​ను ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.