ETV Bharat / sports

ఆసియా కప్​లో భారత మహిళల జట్టుపై పాక్​ గెలుపు - భారత మహిళల జట్టు vs పాకిస్థాన్ మహిళల జట్టు

Womens Asia Cup 2022 : మహిళల ఆసియా కప్​లో జరిగిన మ్యాచ్​లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​ చేతిలో ఓడిపోయింది భారత జట్టు. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 124 పరుగులకు ఆలౌట్​ అయ్యింది.

Womens Asia Cup 2022
Womens Asia Cup 2022
author img

By

Published : Oct 7, 2022, 4:18 PM IST

Womens Asia Cup 2022 : మహిళల ఆసియా కప్​లో భాగంగా భారత్​, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్​ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్​ వరకు సాగిన మ్యాచ్​లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​ చేతిలో ఓడిపోయింది భారత జట్టు. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 124 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. చివర్లో రిచా ఘోశ్ 13 బంతుల్లో 26 (1x4, 3x6) ఒంటరిగా పోరాడినా ఫలితం దక్కలేదు. పాక్​ బౌలర్లలో నశరా సంధు మూడు వికెట్లు, నిదా దార్​, సాదియా ఇక్బాల్​ రెండు వికెట్లు, తుబా హసన్, ఐమాన్​ అన్వర్​ చెరో​ వికెట్​ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. పవర్​ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో ఉన్న పాక్​ జట్టును నిదా దార్.. కెప్టెన్​​ మరూఫ్ ఆదుకున్నారు.​ నిదా దార్​ 37 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్​గా నిలవగా.. మరూఫ్​ 35 బంతుల్లో 32 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది. పూజా వస్త్రాకర్​ 2, రేణుకా సింగ్​ ఒక వికెట్ తీశారు.

ఇవీ చదవండి: 'రుతురాజ్‌ ఇషాన్‌.. అది మంచి పద్ధతి కాదయ్యా'.. నెట్టింట ఫుల్​ ట్రోలింగ్‌!

'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం.. సంజూ ఈజ్​ గ్రేట్‌!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.