IND VS WI 2023 Jadeja : వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. మొదటి మ్యాచ్‌తో టీమ్ఇండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును అందుకునే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీస్తే.. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇటీవలే గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన రవీంద్ర జడేజా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి అతడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కుంబ్లేతో సంయుక్తంగా.. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌పై మాజీ దిగ్గజం కపిల్ దేవ్ 43 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు విండీస్‌పై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అగస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో 41 వికెట్లతో అనిల్ కుంబ్లే ఉన్నాడు. కుంబ్లేతో పాటు రవీంద్ర జడేజా కూడా అన్నే వికెట్లు తీశాడు. ఇప్పుడు తాజా జరగబోయే మొదటి వన్డేలో జడ్డూ మరో మూడు వికెట్లు సాధిస్తే.. కపిల్ దేవ్‌ను అధిగమించే అవకాశం ఉంది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. జూలై 27, 29 జరగనున్న మ్యాచులు బార్బడోస్ వేదికగా నిర్వహించనున్నారు. ఆగస్టు 1న ఆఖరి వన్డే ట్రినిడాడ్ వేదిక జరగనుంది. టెస్టు సిరీస్‌తో విండీస్ పర్యటన ప్రారంభించిన భారత జట్టు.. 1-0తో ఆ సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
డబ్ల్టూటీసీ పాయింట్లపై ఎఫెక్ట్ఈ : సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయాన్ని సాధించింది. అయితే రెండు మ్యాచుల్లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ చేయాలని గట్టిగానే ప్రయత్నించింది. కానీ వరుణుడు ఆ విజయాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో సిరీస్ భారత్ సొంతమైనప్పటికీ.. డబ్ల్టూటీసీ పాయింట్లపై ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం భారత జట్టు.. రెండు టెస్టుల్లో ఒక విజయం, ఒక డ్రా చేసుకోవడం వల్ల 16 పాయింట్లను సాధించింది. కానీ పర్సంటేజీలో మాత్రం 66.67 శాతంతోనే ఉండిపోయింది. ఇక ఈ జాబితాలో పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి :
ప్రపంచకప్ డిమాండ్ పీక్స్.. హాట్‌స్టార్ టార్గెట్ రూ.వెయ్యి కోట్లు.. ఒక్కో యాడ్‌కు అన్ని లక్షలా?
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ టాప్.. జైస్వాల్ కూడా ఆ పొజిషన్లోకి..