ETV Bharat / sports

టాప్​ పొజిషన్​కు గిల్ - కెరీర్​లో అత్యుత్తమం, ఐసీసీ ర్యాంకింగ్స్​ రిలీజ్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 2:28 PM IST

Updated : Nov 8, 2023, 4:08 PM IST

ICC ODI Ranking 2023 : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్.. వన్డే ర్యాంకింగ్స్​లో నెం.1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.

ICC ODI Ranking 2023
ICC ODI Ranking 2023

ICC ODI Ranking 2023 : ఐసీసీ బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్​.. బాబర్ అజామ్​ను వెనక్కినెట్టి ఆగ్రస్థానాన్ని దక్కించున్నాడు. గిల్​ ప్రస్తుతం 830 రేటింగ్స్​తో తొలిసారి కెరీర్​లో టాప్​ పొజిషన్​కు చేరుకున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 824 రేటింగ్స్​తో రెండో స్థానానికి పడిపోయాడు. ఇక టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (770) నాలుగో స్థానంలో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (739) ఆరో ప్లేస్​లో కొసాగుతున్నాడు. ఇక ప్రస్తుత వరల్డ్​కప్ టోర్నమెంట్​లో రాణిస్తున్న టీమ్ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా 17 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. అతడు ప్రస్తుతం 643 రేటింగ్స్.. 18వ స్థానంలో ఉన్నాడు.

టాప్ 5 స్థానాల్లో ఉన్న బ్యాటర్లు

  • శుభ్​మన్ గిల్ (భారత్) - 830 రేటింగ్స్​
  • బాబర్ అజామ్ (పాకిస్థాన్ )- 824 రేటింగ్స్
  • క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా) - 771 రేటింగ్స్
  • విరాట్ కోహ్లీ (భారత్) - 743 రేటింగ్స్
  • డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - 743 రేటింగ్స్.

సిరాజ్ మళ్లీ నెం. 1 .. గతమ్యాచ్​లో సౌతాఫ్రికాపై చెలరేగిన టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (709 రేటింగ్స్​).. రెండు స్థానాలు ఎగబాకి టాప్​లోకి చేరుకున్నాడు. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (694 రేటింగ్స్) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో కుల్​దీప్ (661 రేటింగ్స్) నాలుగో స్థానంలో ఉండగా.. జస్​ప్రీత్ బుమ్రా (654) ఎనిమిది, మహ్మద్ షమి (635 రేటింగ్స్) 10వ స్థానంలో కొనసాగుతున్నారు. కాగా, ఈ లిస్ట్​ టాప్ 10లో 4 భారత బౌలర్లు ఉండడం విశేషం.

టాప్ 5 స్థానాల్లో ఉన్న బౌలర్లు..

  • మహ్మద్ సిరాజ్ (భారత్) - 709 రేటింగ్స్
  • కేశవ్ మహరాజ్ (సౌతాఫ్రికా) - 694 రేటింగ్స్
  • ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) - 662 రేటింగ్స్
  • కుల్​దీప్ యాదవ్ (భారత్) - 661 రేటింగ్స్
  • షహీన్ అఫ్రిదీ (పాకిస్థాన్) - 658 రేటింగ్స్

టీమ్ఇండియా @ 1.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో భారత ఆటగాళ్ల డామినేషన్ క్లియర్​గా కనిపిస్తుంది. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో భారత ప్లేయర్లే టాప్​లో ఉన్నారు. ఇక వన్డే జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమ్ఇండియా 265 రేటింగ్స్​తో టాప్​లో ఉంది.

భారత్​ X దక్షిణాఫ్రికా మ్యాచ్​ టికెట్ల 'బ్లాక్​ దందా'.. వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐకి బంగాల్​ పోలీసుల నోటీసులు!

ICC ODI Ranking 2023 : టాప్​ ప్లేస్​కు అతిదగ్గరలో గిల్-సిరాజ్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ రిలీజ్

Last Updated : Nov 8, 2023, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.