ETV Bharat / sports

'ఫిట్​నెస్​పై ఫోకస్​ చేశా.. కాస్త టైమ్​ ఇవ్వండి' - హార్దిక్ పాండ్య ఫిట్​నెస్​ న్యూస్

Hardik Pandya Fitness: టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్య ఫిట్​నెస్​పై చాలా రోజుల నుంచి చర్చజరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనకు అతడిని ఎంపిక చేస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అతడు పూర్తిస్థాయి ఫిట్​నెస్​పై ఫోకస్​ చేస్తున్నట్లు తెలిసింది.

hardik pandya
హార్దిక్ పాండ్య
author img

By

Published : Nov 28, 2021, 5:45 PM IST

Hardik Pandya Fitness: టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్​నెస్​పై ధ్యాస పెట్టినట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా చాలా కాలంగా బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్న పాండ్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్​లోనూ హార్దిక్​కు చోటు లభించడం కష్టంగానే మారింది.

ఈ నేపథ్యంలో కొద్ది రోజుల వరకు తనను పరిగణలోకి తీసుకోవద్దని పాండ్య.. సెలక్టర్లను కోరినట్లు సమాచారం. పూర్తి ఫిట్​నెస్​ సాధించాకే(Hardik Pandya Focusing on Overall Fitness) జట్టులోకి తిరిగి వస్తానని వారితో అతడు చెప్పినట్లు తెలుస్తోంది.

బ్యాటర్​గానే..

2021లో ఐపీఎల్​ సీజన్​లో పాండ్య ముంబయి జట్టు తరఫున ఒక్క ఓవర్​ కూడా బౌలింగ్ చేయలేదు. టీ20 ప్రపంచకప్​లోనూ ఉత్తమ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్​ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు ఒక్క వికెట్​ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో పాండ్య ఫిట్​నెస్​పై విమర్శలు మరింత పెరిగాయి.

దక్కని అవకాశం..

టీ20 ప్రపంచకప్​లో ప్రభావం చూపని కారణంగానే హార్దిక్​ను న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​కు ఎంపిక చేయకుండా పక్కనపెట్టేశారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో అతడు పూర్తి స్థాయి ఫిట్​నెస్​ నిరూపించుకుంటేనే దక్షిణాఫ్రికా పర్యటనలో చోటు కల్పించే అవకాశముంటుందని బీసీసీఐ వర్గాలు ఇటీవలే తెలిపాయి. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడు ఫిట్​నెస్​ నిరూపించుకోవాల్సి ఉంది.

సందిగ్ధంలో..

South Africa Covid Variant: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్​(బీ.1.1.529)తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. తమ దేశంలోనూ ఆ వేరియంట్ ప్రభావం కనిపిస్తుందంటూ పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోత్స్​వానా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు(South Africa Travel Ban) విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ కరోనా కొత్త రకంతో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే సిరీస్ సందిగ్ధంలో పడింది.

ఇదీ చదవండి:

చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారత ఆటగాడిగా!

పుజారా, రహానే టెస్టు స్థానాలు ఇక గాల్లో దీపమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.