Dhoni Pakistan visit : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన ఆటకే కాకుండా తన వ్యక్తిత్వానికి దేశ విదేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా ధోనీని పాకిస్థాన్‌కు రమ్మంటూ ఓ వ్యక్తి ఆహ్వానించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ?
క్రికెట్లో ఉన్నప్పుడు టోర్నీల కోసం 2006-08 మధ్య కాలంలో ధోనీ పాకిస్థాన్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడి ఫుడ్‌ను ఆయన టేస్ట్ చేశాడు. అది మాహీకి ఎంతో నచ్చిందట. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ అభిమానితో పంచుకున్నాడు. అక్కడి ఫుడ్ చాలా బాగుంటుందంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే దాన్ని చూసి పాకిస్థాన్ స్పోర్ట్స్ యాంకర్ ఫఖర్ ఆలం ఈ విషయంపై స్పందించారు. పాకిస్థాన్ ఫుడ్ గురించి ధోనీ మాట్లాడటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దీంతో క్రికెట్ కోసమే కాకుండా ఫుడ్ టేస్ట్ చేసేందుకు మరోసారి పాకిస్థాన్‌కు రావాలంటూ ధోనీని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
-
Bhai @msdhoni dil jeet liya aap nay….…..I think you should be in The Pavilion with us not just for the cricket but for the FOOD. ❤️ https://t.co/oTmsXdoTzx
— Fakhr-e-Alam S.I & S.E (@falamb3) December 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bhai @msdhoni dil jeet liya aap nay….…..I think you should be in The Pavilion with us not just for the cricket but for the FOOD. ❤️ https://t.co/oTmsXdoTzx
— Fakhr-e-Alam S.I & S.E (@falamb3) December 29, 2023Bhai @msdhoni dil jeet liya aap nay….…..I think you should be in The Pavilion with us not just for the cricket but for the FOOD. ❤️ https://t.co/oTmsXdoTzx
— Fakhr-e-Alam S.I & S.E (@falamb3) December 29, 2023
మరోవైపు ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతే కాకుండా తన టైమ్‌ను ఫ్రెండ్స్, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడు. అయితే ఎక్కడ చూసినా ఆయన ఇంకా లాంగ్ హెయిర్లోనే కనిపిస్తున్నాడు. దీని గురించి కూడా ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యులో మాట్లాడాడు. అంతే కాకుండా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. గతంలో తాను యాడ్ ఫిల్మ్ కోసం వెళ్లినప్పుడు మేకప్, హెయిర్ స్టైల్ కోసం కొన్ని నిమిషాల సమయమే తీసుకునేవాడిని అని, కానీ ఇప్పుడు మాత్రం గంటకు పైగా సమయం పడుతోందని చెప్పుకొచ్చాడు. అయితే ఇది కాస్త బోరింగ్‌గా అనిపించినా తన అభిమానులకు ఈ హెయిర్ స్టైల్ నచ్చడం వల్ల మరి కొంతకాలం ఆ స్టైల్‌ను అలానే ఉంచుకుంటానని తెలిపాడు. అయితే ఆ తర్వాత మళ్లీ ఓ కొత్త స్టైల్‌ను ట్రై చేస్తానని చెప్పుకొచ్చాడు.
-
He is playing IPL 2024 for his fans
— Bhavyaa M. (@BhavyaaDhoni) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
He is keeping long hair because his fans liked it.
Find yourself an idol who loves you like Dhoni loves his fans ❤️🥹✨ pic.twitter.com/s4ZlbD5L42
">He is playing IPL 2024 for his fans
— Bhavyaa M. (@BhavyaaDhoni) December 27, 2023
He is keeping long hair because his fans liked it.
Find yourself an idol who loves you like Dhoni loves his fans ❤️🥹✨ pic.twitter.com/s4ZlbD5L42He is playing IPL 2024 for his fans
— Bhavyaa M. (@BhavyaaDhoni) December 27, 2023
He is keeping long hair because his fans liked it.
Find yourself an idol who loves you like Dhoni loves his fans ❤️🥹✨ pic.twitter.com/s4ZlbD5L42
Dhoni New Look : వింటేజ్ లుక్‌లో ధోనీ కొత్త ఫొటోలు.. ఆ స్టార్ హీరోలానే ఉన్నాడుగా..
ధోనీ చేసిన పనికి రైనా షాక్ - పెళ్లికి పిలిచి మరీ అలా అన్నాడట!