ETV Bharat / sports

'భారత్​, పాక్ మ్యాచ్​లను మిస్సవుతున్నా​' - యూవి మాటలను గుర్తుచేసుకున్న షోయబ్​ మాలిక్​

ఓ మ్యాచ్​లో టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ తనతో అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు పాక్ క్రికెటర్​ షోయ‌బ్ మాలిక్. ఇరు జట్ల మధ్య స్నేహం, క్రికెట్​ వైరాన్ని మిస్​ అవుతున్నట్లు తెలిపాడు.

shoyab, yuvi
షోయబ్​, యూవీ
author img

By

Published : Jun 23, 2020, 10:00 AM IST

Updated : Jun 23, 2020, 10:13 AM IST

భారత్​, పాక్​ ఆటగాళ్ల మ‌ధ్య స్నేహ బంధం గురించి వివరించాడు పాక్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్. మైదానంలో నువ్వానేనా అన్న‌ట్లు త‌ల‌ప‌డే రెండు జ‌ట్ల క్రికెట‌ర్లు మైదానం వెలుపల ఎంతో చ‌నువుగా, స్నేహ‌పూర్వ‌కంగా ఉంటార‌ని తెలిపాడు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2017లో పాక్​ జట్టు గెలిచాక యువ‌రాజ్ సింగ్ త‌న‌తో అన్న ‌మాట‌ల‌ను గుర్తుచేసుకున్నాడు.

"విజ‌యం విష‌యానికి వ‌స్తే 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెల‌వ‌డం అద్భుత‌మైన అనుభూతి. కానీ నాకు మ‌రో మ‌ధుర స్మృతి ఉంది. మ్యాచ్ ముగిశాక భోజ‌న‌శాల‌లో యువ‌రాజ్ సింగ్‌తో మాట్లాడా. మీ జ‌ట్టు స‌భ్యులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్ర‌త్యేక సంద‌ర్భాన్ని మిస్స‌వ్వ‌కు. వారితో క‌లిసి వేడుక చేసుకోవాల‌ని యువీ నాతో చెప్పాడు. క్రికెట్ ఎలాంటి స్నేహాల‌ను అందిస్తుందో చెప్పేందుకు ఇదొక ఉదాహ‌ర‌ణ‌."

-మాలిక్, పాక్ క్రికెటర్​.

భార‌త్‌, పాక్ క్రికెట్ వైరాన్ని తాము చాలా మిస్స‌వుతున్నామ‌ని తెలిపాడు మాలిక్. ఇరువురి మధ్య సిరీస్​లు ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతాయ‌ని వెల్లడించాడు.

ఈ టోర్నీలో టీమ్ఇండియా అద్భుతంగా ఆడింది. లీగ్ మ్యాచ్‌లో పాక్‌ను చిత్తుచిత్తుగా ఓడించినప్పటికీ.. ఫైన‌ల్లో మాత్రం చేతులెత్తేసింది. 339 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో రోహిత్‌, శిఖ‌ర్ ధావ‌న్‌, కోహ్లీ, యువ‌రాజ్‌, ధోనీ విఫ‌ల‌మ‌య్యారు. చివ‌ర్లో హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌తో ఆశ‌లు రేపినా జ‌డ్డూతో స‌మ‌న్వ‌య లోపంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. ఫలితంగా భారత్​ రన్నరప్​తో సరిపెట్టుకుంది.

ఇది చూడండి : లాక్​డౌన్​కు చెక్​ పెట్టిన యువ గ్రాండ్​మాస్టర్లు

Last Updated : Jun 23, 2020, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.