వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్.. టీ20ల్లో అద్భుత నైపుణ్యాలున్న ఆటగాడని ప్రశంసించారు కోల్‌కతా నైట్‌రైడర్స్ సీఈఓ వెంకీ మైసూర్. ఈ క్రమంలో రసెల్‌ను మైకేల్ జోర్డాన్‌తో పోల్చారు. ఐపీఎల్ గత సీజన్లో 14 మ్యాచ్‌లాడి 56.66 సగటుతో 510 పరుగులు చేశాడీ ఆల్‌రౌండర్. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు, 11 వికెట్లు ఉన్నాయి.

"ప్రపంచంలోనే అగ్రశ్రేణి టీ20 క్రికెటర్లలో ఆండ్రూ రసెల్ ఉండటం మా అదృష్టం. బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్ ఇలా మీరు ఎన్నైనా అనొచ్చు. కానీ అతడు టీ20ల్లో మైకేల్ జోర్డన్ లాంటివాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు"
వెంకీ మైసూర్, కేకేఆర్ సీఈఓ
రసెల్‌తో పాటు సునీల్ నరైన్ లాంటి గొప్ప ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని వెంకీ చెప్పారు. "సునీల్ నరైన్ బౌలర్‌గా ఎలాంటివాడో అందరికీ తెలుసు. కానీ తనను తాను ఆల్‌రౌండర్‌గా మలుచుకున్నాడు. మరో విశేషమేంటంటే పాట్ కమ్మిన్స్, నితీశ్ రానా రూపంలో జట్టులో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉన్నారు. బ్యాటింగ్‌లోనూ, కెప్టెన్‌కు కావాల్సినట్లు వివిధ దశల్లో బౌలింగ్ చేయడంలోనూ వీళ్లు సిద్ధహస్తులు" అని పేర్కొన్నారు.
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు జరగనుంది. 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. ఆగస్టు 20లోపు ఆటగాళ్లందరూ ప్రాక్టీసు కోసం ఆ దేశానికి చేరుకోనున్నారు.