కరోనా వల్ల స్తంభించిపోయిన క్రికెట్ పునః ప్రారంభమయ్యేసరికి క్రికెటర్లందరూ మానసికంగా దృఢంగా ఉండాలని అన్నారు టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మెన్ సందీప్ పాటిల్. ఈ లాక్డౌన్లో శరీరానికి ఎటువంటి గాయాలు తగలకుండా, ఫిట్‌గా ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. అయితే ఈ సూచనలు ఆటగాళ్లకు ఓ పెద్ద సవాల్ లాంటిదని చెప్పుకొచ్చారు. గాయలైతే జట్టులో చోటు ప్రశ్నార్థకం కావొచ్చని అభిప్రాయపడ్డారు.
63ఏళ్ల ఈ మాజీ ఆటగాడు... తన కెరీర్లో మొత్తం 29 టెస్టులు, 1983లో ప్రపంచకప్‌లో ఆడారు. ఈ ప్రపంచకప్‌లో ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండటం వల్లే జట్టు విజయం సాధించిందని చెప్పుకొచ్చారు.
వచ్చే నెలలో ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ పునః ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి : ప్రమాదంలో వికెట్‌కీపర్ కారు నుజ్జు నుజ్జు