ETV Bharat / sports

ఈ ఏడాది సీపీఎల్​ నుంచి తప్పుకున్న గేల్​ - chris gayle news

వెస్టీండీస్​ స్టార్​ క్రికెటర్​ క్రిస్​ గేల్​ ఈ ఏడాది కరేబియన్​ ప్రీమియర్​ లీగ్​(సీపీఎల్​)కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

Gayle pulls out of Caribbean Premier League due to personal reasons
ఈ ఏడాది సీపీఎల్​ నుంచి తప్పుకున్న గేల్​
author img

By

Published : Jun 24, 2020, 7:29 AM IST

ఈ ఏడాది కరేబియన్​ ప్రీమియర్​ లీగ్​(సీపీఎల్​)కు దూరమవుతున్నట్లు వెస్టిండీస్​ విధ్వంసకర బ్యాట్స్​మెన్​​ క్రిస్​ గేల్ ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఆటగాళ్లను ఎంపిక చేసే ఒక రోజు ముందు గేల్​ ఈ ప్రకటన చేశారు.

లాక్​డౌన్​ కారణంగా తన కుటుంటాన్ని, పిల్లలను కలవలేకపోవడమే కారణంగా గేల్​ తన ఈ మెయిల్​లో తెలిపినట్లు ఈఎస్​పీఎన్​ క్రిక్​ఇన్​ఫో సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం తన కుటుంబంతో గడిపేందుకు గేల్​ విరామం కోరుకుంటున్నట్లు పేర్కొంది సంస్థ.

సెయింట్​ లూసియా జూక్స్​ జట్టు తరఫున ఆడేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు గేల్​. గతంలో జమైకా తలావాస్​, సెయింట్​ కిట్స్​ అండ్​ నెవీస్​ పేట్రియాట్స్​ తరఫున ఆడగా.. రెండు సార్లు సీపీఎల్​ టైటిల్​ గెలుచుకున్నాడు.

అయితే, ఇటీవలే జమైకా తలావాస్​ కోచ్​ రామ్​నరేశ్​ శర్వాణ్​పై విమర్శలు గుప్పించాడు ఈ దిగ్గజ ఆటగాడు. సీపీఎల్​లోని జమైకా తలావాస్​ జట్టు నుంచి తనను తొలగించడానికి శర్వాణ్​ కారణమని ధ్వజమెత్తుతూ.. అతడ్ని పాముకంటే ప్రమాదకారిగా పేర్కొన్నాడు.

ఇదీ చూడండి:'కరోనా వైరస్​ కంటే ప్రమాదకారివి నువ్వు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.