కరోనా ప్రభావం వల్ల ఆటలో పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది క్రికెట్ ఆస్ట్రేలియా. బంతిపై మెరుపు కోసం లాలాజలం, చెమట వంటివి రుద్దడాన్ని నిషేధించింది. కరోనా సంక్షోభం ముగిసిన వెంటనే వీటిని అమలు పరచనున్నట్లు తెలిపింది. ఇందుకోసం వైద్య నిపుణులు, క్రీడాధికారులు, ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
కరోనా అనంతరం ఆట తిరిగి ప్రారంభమయ్యాక లెవల్ ఏ,బీ,సీలుగా విభజించి... ఈ మార్గదర్శకాలు పాటించనున్నట్లు తెలిపింది. మైదానంలోకి పునరాగమనం చేయాలనుకునేవారు కచ్చితంగా క్వారంటైన్లో ఉండి రావాలని పేర్కొంది.
అదే విధంగా శిక్షణ శిబిరాల్లోనూ పలు జాగ్రత్తలు పాటించాలని ఆటగాళ్లకు సూచించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఎలాంటి శ్వాసకోశ ఇబ్బందులున్నా వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించింది.