'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ప్రోమో(Sridevi Drama Company Latest Promo) అదిరింది. ఈసారి కవలల(twins) నేపథ్యంలో ఎపిసోడ్ మొత్తాన్ని తెరకెక్కించారు. ఎంతోమంది ట్విన్స్‌ను తీసుకొచ్చి, వారితో డ్యాన్స్, స్కిట్, సింగింగ్ చేయించి ఆకట్టుకున్నారు.

హైపర్ ఆది(hyper aadi).. కవలలతో కలిసి చేసిన ఫ్యామిలీ స్కిట్ నవ్విస్తుంది. 'ఇద్దరూ ఒకేలా ఉండటం వల్ల ఎవర భార్యో, ఎవరు మరదలో తెలుసుకోలేకపోతున్నానని' ఆది అనగా, 'అలా అయితే నీకు మంచిది కదరా' అని బాబా భాస్కర్(baba bhaskar) పంచ్ వేశారు.

పలువురు ట్విన్స్ మాస్, క్లాస్, సంప్రదాయ పాటల డ్యాన్స్‌లు వేసి అలరించారు. 'డియర్ మేఘ' హీరోహీరోయిన్ మేఘా ఆకాశ్(megha akash), అరుణ్ అదిత్ షోకు విచ్చేసి సందడి చేశారు.
చివర్లో సుడిగాలి సుధీర్(sudigali sudheer), హైపర్ ఆదిలకు ట్విన్స్ ఉన్నారని చెబుతూ, వారిని కూడా స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఇంతకీ వాళ్లెవరు? అనేది తెలియాలంటే సెప్టెంబరు 12వ తేదీ వరకూ ఆగాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: