ఈటీవీ వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రాం 'ఊరిలో వినాయకుడు'(Oorilo Vinayakudu) కొత్త ప్రోమో వచ్చేసింది. ఆద్యంతం అలరిస్తూ ఎపిసోడ్‌పై అంచనాల్ని పెంచేస్తోంది. గెస్ట్‌గా విచ్చేసిన హీరో శ్రీకాంత్.. సుడిగాలి సుధీర్(Sudigaali sudheer), హైపర్ ఆదిపై(hyper adhi) వేసిన పంచులు తెగ నవ్విస్తున్నాయి.
శ్రీకాంత్ ఎవరి టీమ్‌లో వెళ్తారు అని సుధీర్ అడగ్గా.. రోజా, ఇంద్రజ(indraja) తమ తమ టీమ్‌లలోకి రావాలంటూ శ్రీకాంత్‌ను చెరోపక్కకు చేతులు పట్టుకుని లాగారు. చివరగా రోజా బృందంలోకి శ్రీకాంత్ చేరారు.

చాలారోజుల తర్వాత సుధీర్ మరోసారి పాట పాడారు. 'రేసుగుర్రం'లోని 'స్పందన' సాంగ్‌ను రష్మి చూస్తూ, రేవంత్‌తో కలిసి ఆలపించాడు. రోజా, రాకెట్ రాఘవ, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్‌ల పిల్లలతో కలిసి రాకింగ్ రాకేష్ స్కిట్ చేశాడు.

జడ్జి రోజా.. మరోసారి డ్యాన్స్ చేశారు. 'బావను నువ్వు భామను నేను' పాటకు తనదైన గ్రేస్‌తో స్టెప్పులు వేశారు. ఇది కాస్త ఆకట్టుకుంటోంది. దీనితో పాటు పూర్ణ, రష్మి, సుధీర్ తదితరులు కూడా కాలు కదిపి నృత్యం చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: