ETV Bharat / sitara

ఆ హిట్​ రీమేక్​లో పవన్​కల్యాణ్​​-చరణ్​!

పవన్​కల్యాణ్​, రామ్​చరణ్(ramcharan pawankalyan)​ కలిసి నటించనున్నారంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. మలయాళ హిట్​ 'డ్రైవింగ్​ లైసెన్స్'​లో(driving license telugu remake) వీరిద్దరూ సందడి చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

ramcharan
చెర్రీ
author img

By

Published : Oct 3, 2021, 12:21 PM IST

Updated : Oct 3, 2021, 2:44 PM IST

పవన్​కల్యాణ్​, రామ్​చరణ్(ramcharan pawankalyan)​ కలిసి ఒకే తెరపై కనువిందు చేయనున్నారా? అంటే అవుననే మాట్లాడుకుంటున్నాయి సినీవర్గాలు. మలయాళ హిట్​ 'డ్రైవింగ్ లైసెన్స్'(driving license telugu remake) తెలుగు రీమేక్​ హక్కుల్ని రామ్​చరణ్ ఎప్పుడో కొన్నారు. అయితే ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది? తెలుగులో ఎవరెవరు చేస్తారు? అనేది ఇంతవరకు స్పష్టత రాలేదు. అయితే కొద్ది రోజులుగా దాని గురించి మళ్లీ మాట్లాడుకుంటున్నారు. పవన్​, చరణ్​ ఈ రీమేక్​లో ప్రధాన పాత్రలు పోషించనున్నారని టాక్​. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట! త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్​కు పండగనే చెప్పాలి. అంతకుముందు పవన్​, రవితేజ కలిసి నటిస్తారని ప్రచారం సాగింది.

'డ్రైవింగ్​ లైసెన్స్'​(driving license movie remake in telugu) హిందీ రీమేక్​లో అక్షయ్​కుమార్​, ఇమ్రాన్​ హష్మి ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం పవన్​.. 'భీమ్లానాయక్​', 'హరిహర వీరమల్లు'(harihara veeramallu story), 'భవదీయుడు భగత్ సింగ్'(Pawankalyan Harishshankar movie), సురేందర్​ రెడ్డి దర్శకత్వంలో ఓ​ సినిమా నటిస్తున్నారు. రామ్​చరణ్​.. త్వరలోనే 'ఆర్​ఆర్​ఆర్', 'ఆచార్య'​ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్​ మూవీలోనూ నటించనున్నారు.

ఇదీ చూడండి: 'భీమ్లానాయక్' ట్రీట్.. రానా సీరియస్​ వార్నింగ్

Last Updated : Oct 3, 2021, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.