మనమంతా హడావిడి జీవితానికి అలవాటు పడిపోయాం. బతుకు పోరులో తరుముకొచ్చే సమస్యలన్నీ మనల్ని చిన్ అప్, షోల్డర్ డౌన్, ఐస్ ఓపెన్ అంటూ ఆడేసుకుంటున్నాయి. కష్టాలకు మనం కుంగిపోతుంటే స్మైల్ ప్లీజ్ అంటూ జనాలు పలికే ఓదార్పు మాటలైతే షరామాములే. అసలు ఈ పరుగెందుకోసమంటే.. ఏమో మనకి కూడా తెలియదు.
ఒక్కోసారి అవసరమైన దానికంటే వేగంగా పరిగెత్తేస్తున్నామా అనే సందేహం మనసుని తొలిచేస్తుంటుంది. పోనీ ఓసారి ఆగి వెనక్కి చూద్దామా అంటే .. పోటీ ప్రపంచంలో వెనుక పడిపోతామేమో అనే భయం ఒకటి. సరిగ్గా అలాంటి సమయంలోనే మనం చూసే కొన్ని సంఘటనలు, విషయాలు, మనం కోల్పోతున్న ఆ నిజమైన మనల్ని.. మళ్లీ మనకు పరిచయం చేస్తాయి. వాస్తవికతలోని అందాన్ని.. ప్రకృతి అంత అందంగా చూపెడతాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. అనవసర ఆర్భాటాలు లేని ఓ మాములు సినిమా. నీ సినిమా, నా సినిమా, మనందరి సినిమా. నిజజీవితాల్లోని వాస్తవికతలను దాటుకొని కల్పనా ప్రపంచంలో సినిమాలన్నీ అతీత శక్తులతో ప్రవర్తిస్తుంటే నేలమీద పారగాన్ చెప్పులతో నడిచిన సినిమా.
తమదేదో తమదంటూ మితిమీరి తగదంటూ.. తమదైన తృణమైనా చాలనే మనసులు.. వాటి తాలుకూ మనుషులు.. ఉన్న చిత్రమిది. చిత్రంగా కలివిడి సూత్రంగా కలబడి ప్రేమ, పంతం తమ సిరిగా బతుకుతున్న వ్యక్తుల కథ ఇది. ఉచిత సలహాలు పగలేని కలహాలు ఎనలేని కథనాలున్న చోటును చూపించే పరిచయమిది. సిసలైన సరదాలతో, పడిలేచే పయనాల్లో, తిమిరాలు తరిమేసే ఓ ఉమామహేశ్వరుడి కథ ఇది.
మలయాళంలో ఘన విజయం సాధించిన 'మహేషింటే ప్రతీకారం'... తెలుగు నుడికారమే ఈ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. కేరాఫ్ కంచరపాలెంతో తెలుగు సినిమాల్లో వాస్తవికత కోణాన్ని తట్టిలేపిన వెంకటేశ్ మహా తీసిన మరో అద్భుతం. పరుచూరి ప్రవీణ, ఆర్కా మీడియా అధినేతలు శోభుయార్లగడ్డ, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సత్యదేవ్ నటన చూసి తీరాల్సిందే.
ఇతర నటీనటుల ప్రతిభ ద్వారా.. అరకు లోయ అందాలు.. పల్లె మనుషుల్లో ఉండే సహజత్వం.. వాళ్ల బడాయి మాటలు.. చిన్న చిన్న కోపాలు.. మంగమ్మ శపథాలు.. వాటి కోసం వాళ్లు పడే ఇక్కట్లు అన్నీ మనల్ని మళ్లీ మన మూలాలకు తీసుకెళ్తాయి. అప్పు ప్రభాకర్ ఫొటోగ్రఫీ, బిజిబల్ సంగీతం అన్నీ కలగలిసి తల్లిలాంటి పల్లెగాలుల్ని మళ్లీ మనకు చల్లగా తాకేలా చేస్తాయి.
కరోనా మహమ్మారి కారణంగా కేవలం ఓటీటీలకే పరిమితమైన ఈ చిత్రాన్ని.. తెలుగు ప్రేక్షులందరికీ చేరువచేస్తోంది ఈటీవీ. సెప్టెంబర్ 13న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాన్ని మీ ఇంటిల్లిపాదితో కలిసి చూడండి. చూసి ఆనందించండి. ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒక్కసారి ఆగి మిమ్మల్ని మీరే జ్ఞప్తికి తెచ్చుకోండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి విద్యార్థుల కోసం సోనూసూద్ ప్రత్యేక స్కాలర్షిప్