ETV Bharat / sitara

'టాలీవుడ్​కు అందుకే దూరమయ్యా'.. రూమర్లపై సమీరా రెడ్డి క్లారిటీ

Sameera Reddy about NTR: 2006లో వచ్చిన 'అశోక్'​ సినిమాలో కలిసి నటించారు ఎన్టీఆర్, సమీరా రెడ్డి. ఆ సమయంలో వీరిపై చాలా రూమర్స్​ వచ్చేవి. ఇద్దరూ రిలేషన్​షిప్​లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల ఫలితంగా తెలుగు సినిమాలనే వదిలేయాల్సి వచ్చిందని అంటోంది సమీరా రెడ్డి.

jr ntr
sameera reddy
author img

By

Published : Jan 8, 2022, 4:41 PM IST

Sameera Reddy: సెలబ్రిటీల అఫైర్ల గురించి చాలా వింటుంటాం. ఈ హీరో ఆమెతో రిలేషన్​లో ఉన్నాడు.. ఆ భామ ఈ నటుడితో డేటింగ్​లో ఉంది.. కలిసి న్యూఇయర్​ చేసుకున్నారు, మాల్దీవులకు వెళ్లారు.. అది చేశారు.. ఇది చేశారు.. బ్లాబ్లాబ్లా..! కానీ, ఇలాంటి రూమర్లు వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఎవరూ పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితే నటి సమీరా రెడ్డికి ఎదురైందట. దీంతో తన కెరీర్​కే గుడ్​బై చెప్పానని అంటున్నారు సమీర.

ashok movie
'అశోక్'​ సినిమా

2006లో వచ్చిన 'అశోక్​' సినిమాలో ఎన్టీఆర్​తో కలిసి నటించారు సమీరా రెడ్డి. ఆ సమయంలో వీరిద్దరూ రిలేషన్​షిప్​లో ఉన్నారంటూ రూమర్లు వచ్చేవి. ఈ వ్యవహారంపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు సమీరా.

jr ntr
ఎన్టీఆర్, సమీరా

"ఎన్టీఆర్​తో పనిచేయడం చాలా బాగుంటుంది. నాకు చాలా విషయాలు నేర్పించాడు. ఒక తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఏమీ తెలియదు. తారక్​ పెద్దగా మాట్లాడేవాడు కాదని అప్పట్లో అంటుండేవారు. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఏదనిపిస్తే అదే మాట్లాడతా. మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. దానిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ వ్యవహారం మా కుటుంబానికి నచ్చలేదు. సినిమాల్లో ఎన్ని బోల్డ్​ క్యారెక్టర్లు చేసినా.. మా నాన్నకు వీటన్నింటిపై సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మా బంధువులు కూడా చాలా మంది ఈ విషయమై నాన్నను ప్రశ్నిస్తుండేవారు. తట్టుకోలేకపోయాను. ఈ రూమర్లకు పుల్​స్టాప్​ పెట్టాలంటే తెలుగు ఇండస్ట్రీని వదిలేయడమే కరెక్ట్​ అనిపించింది. అదే పని చేశా. ఆ తర్వాత తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయి."

- సమీరా రెడ్డి, నటి

sameera reddy
సమీరా

'సూర్య సన్నాఫ్​ కృష్ణన్' సినిమాతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది సమీరా. ఆ తర్వాతా పలు చిత్రాల్లో నటించారు. ఇన్నేళ్ల తర్వాత తనపై వచ్చిన రూమర్ల గురించి తలచుకుంటే నవ్వొస్తుందని, కానీ ఆ సమయంలో చాలా భయమేసేదని చెప్పారు. నటుడిగా ఎన్టీఆర్​ ఎదిగిన తీరు చాలా బాగుందని అన్నారు.

ఇదీ చూడండి: Madhavan: 'రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌ను చూస్తే అసూయ కలుగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.