Ravi Teja Ravanasura Movie: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'రావణాసుర'. ఈ చిత్ర రెండో షెడ్యూల్ హైదరాబాద్లో పూర్తి అయ్యింది. ఈ సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు.

మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'రావణాసుర'లో రవితేజతోపాటు యువ కథానాయకుడు సుశాంత్ నటిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, పూజిత, మేఘా ఆకాశ్, అను ఇమ్మన్యూయేల్, దక్షా నగర్కార్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.
భారీ యాక్షన్ సినిమాలో సుధీర్ బాబు..

సుధీర్ బాబు హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇది ఆయన 16వ చిత్రం. ఈ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద ప్రసాద్ నిర్మించనున్నారు.
ఇదీ చదవండి: ఇన్స్టాలో రణ్వీర్ పోస్ట్.. నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు