ETV Bharat / sitara

ప్రభాస్​తో రొమాన్స్​కు రెడీ అయిన ఆలియా! - Alia bhatt latest news

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోయిన్​గా ఆలియాను పరిశీలిస్తోందట చిత్రబృందం.

ఆలియా
ఆలియా
author img

By

Published : May 21, 2020, 6:49 PM IST

ప్రభాస్‌ కథానాయకుడిగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ చిత్రం ప్రకటించారు. సరికొత్త కథాంశంతో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని నాయిక విషయంలో ప్రచారం సాగుతోంది టాలీవుడ్‌ వర్గాల్లో.

ప్రభాస్‌ కోసం ఆలియా భట్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట అశ్విన్‌. ఈ కథకు ఆమె అయితేనే బాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయి కావడం వల్ల ఆలియాను తీసుకునే అవకాశాలున్నాయని టాక్‌. కొన్ని రోజుల్లో స్పష్టత రావొచ్చు.

ప్రస్తుతం ఆలియా చేతిలో 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'గంగూభాయి' చిత్రాలున్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయ్యాక నాగ్‌ అశ్విన్‌ సినిమా పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.