పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(pawan kalyan) మరో సినిమా షూటింగ్‌కు సిద్ధమయ్యారు. హరీశ్ శంకర్(pawan kalyan harish shankar movie) దర్శకత్వంలో నటించే చిత్రం షూటింగ్ కొన్నిరోజుల్లో మొదలుకానుంది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా వెల్లడించారు.

ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా ప్రీలుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అందులో బైక్‌పై మైక్ పట్టుకుని కూర్చుని ఉన్న పవన్ సగం లుక్ ఆకట్టుకుంటోంది. 'ఈసారి ఎంటర్టైన్మెంట్ పాటు...' అంటూ ఆ పోస్టర్లో రాసుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇదే కాకుండా 'భీమ్లా నాయక్'(bheemla nayak), 'హరిహర వీరమల్లు'(harihara veeramallu story) సినిమాల్లో పవన్ నటిస్తున్నారు. ఇవి రెండు చిత్రాలు వచ్చే ఏడాది జనవరి 12, ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నాయి.

ఇవీ చదవండి: