ETV Bharat / sitara

నెగటివ్​ రోల్​లో నాని!.. 'ఆహా'లో త్రిష మలయాళ సినిమా - nani dussera movie

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో నాని, త్రిష, అక్షయ్​కుమార్​ చిత్రాల సంగతులు ఉన్నాయి. అవేంటో చూసేయండి..

new cinema updates
కొత్త సినిమా అప్డేట్స్​
author img

By

Published : Jan 18, 2022, 9:33 PM IST

Nani in Negative role: నేచురల్​ స్టార్​ నాని.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. మొదటి నుంచి తనని తాను తెరపై కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తున్నారు. డిఫరెంట్​ లుక్స్​లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్​ ఓదెల దర్శకత్వంలో 'దసరా' సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఫ్యాన్స్​ను ఉత్సాహపరిచే వార్త ఒకటి జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో ఆయన నెగటివ్​ షేడ్స్​ ఉన్న పాత్రలో కనిపిస్తారని, లుక్​ కూడా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. కాగా, గతంలోనూ నాని 'జెంటిల్​మెన్'​, 'వి' చిత్రాల్లో కాస్త నెగటివ్​ షేడ్స్​ కలిగిన రోల్స్ చేసి ఫ్యాన్స్​ను ఆకట్టుకున్నారు. 'దసరా' సినిమాను చెరుకూరి సుధాకర్​ నిర్మిస్తుండగా.. హీరోయిన్​గా కీర్తిసురేశ్​ నటిస్తోంది. ఈ మూవీతో పాటు 'అంటే సుందరానికి' కూడా చేస్తున్నారు నాని. వివేక్​ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.

nani
నాని

'ఆహా'లో త్రిష సినిమా

Trisha movie in Aha: తెలుగుతో పాటు, తమిళంలోనూ గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిష. అయితే, చాలా ఆలస్యంగా ఆమె మలయాళంలో అడుగుపెట్టారు. నివిన్‌ పౌలితో కలిసి ఆమె నటించిన చిత్రం 'హే జూడ్‌'. శ్యామ్‌ ప్రసాద్‌ దర్శకుడు. 2018లో విడుదలైన ఈ సినిమా విమర్శకులతో పాటు, ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీలో ‘ఆహా’ సందడి చేసేందుకు సిద్ధమైంది. జనవరి 21వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు ‘ఆహా’ తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'సిరివెన్నెల' ఫుల్​ వీడియో సాంగ్​

Shyamsingha roy song: దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆఖరి గీతం ‘సిరివెన్నెల’. నాని హీరోగా తెరకెక్కిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలోని గీతమిది. అన్ని వర్గాల శ్రోతల్ని హత్తుకున్న ఈ పాట ఫుల్‌ వీడియో మంగళవారం విడుదలైంది. శ్యామ్‌ సింగరాయ్‌గా నాని, దేవదాసిగా సాయి పల్లవి నటన, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మిక్కీ జె. మేయర్‌ స్వరాలందించిన ఈ గీతాన్ని అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ చిత్రాన్ని కోల్‌కతా నేపథ్యంలో దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ తెరకెక్కించారు. నాని రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. అభినవ్‌ గోమటం, మడోన్నా సెబాస్టియన్‌ కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలో విడుదలై మంచి విజయం అందుకుంది. జనవరి 21 నుంచి ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కానుంది.

కొత్త రిలీజ్​ డేట్​తో

అక్షయ్​కుమార్​ నటించిన కొత్త సినిమా బచ్చన్​ పాండే కొత్త రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది. మార్చి 18న విడుదల కానున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ మూవీకి ఫర్హద్​ సమ్జి దర్శకత్వం వహిస్తున్నారు.

akshay kumar
అక్షయ్​కుమార్​ కొత్త సినిమా రిలీజ్​ డేట్​

ఇదీ చూడండి: దిమాక్​ ఖరాబ్​ చేస్తున్న పూజాహెగ్డే, జాన్వీ పోజులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.