ETV Bharat / sitara

తెరపై నాని, సాయి పల్లవి జోడీ మరోసారి - నాని సాయి పల్లవి సినిమా

నాని హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగరాయ్'​ అనే చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో ముగ్గురు కథానాయికలకు చోటుండగా.. ఓ హీరోయిన్​గా సాయి పల్లవి ఎంపికైంది.

Nani to Romance with Sai Pallavi again
నాని
author img

By

Published : Jun 23, 2020, 10:30 AM IST

'ఎమ్‌.సి.ఎ' చిత్రంతో సందడి చేసిన జోడీ.. నాని, సాయిపల్లవి. ఆ ఇద్దరూ మరోసారి కలిసి నటించబోతున్నారు. నాని కథానాయకుడిగా, రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో 'శ్యామ్‌ సింగరాయ్‌' తెరకెక్కబోతోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం కథానాయికల ఎంపిక జరుగుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్​కు చోటుంది. ఓ కథానాయికగా సాయిపల్లవి ఎంపికైంది. ఇటీవలే కథ విన్న ఆమె సినిమాకు పచ్చజెండా ఊపారని సినీ వర్గాలు వెల్లడించాయి. మరో ఇద్దరు కథానాయికల ఎంపిక కోసం చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇదొక చారిత్రక కథతో తెరకెక్కుతున్నట్టు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.