ETV Bharat / sitara

MAA Elections: 'మా' ఎన్నికలకు ముహూర్తం ఖరారు - సెప్టెంబరులో మా ఎన్నికలు

మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ అధ్యక్ష ఎన్నికలకు(MAA Elections) రంగం సిద్ధమైంది. ప్రస్తుత కార్యవర్గ సభ్యుల పదవీకాలం పూర్తవ్వడం వల్ల సెప్టెంబరు రెండో వారంలో ఎలెక్షన్స్​ను నిర్వహించాలని కృష్ణంరాజు నేతృత్వంలో సమావేశమైన కార్యవర్గ సభ్యులు నిర్ణయించారు.

Movie Artists Association Election to be held in September
MAA Elections: 'మా' ఎన్నికలకు ముహూర్తం ఖరారు
author img

By

Published : Jul 29, 2021, 10:00 PM IST

తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలకు(MAA Elections) సెప్టెంబర్​లో తేదీ ఖరారైంది. 2021-23 ఏడాదికి గానూ సెప్టెంబర్ 12న అసోసియేషన్​కు ఎన్నికలు నిర్వహించాలని కార్యవర్గ సభ్యులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు 'మా' అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుతో 'మా' అధ్యక్ష కార్యదర్శులతోపాటు పలువురు కార్యవర్గ సభ్యులు వర్చువల్​గా సమావేశమయ్యారు.

'మా' అసోసియేషన్​లో ఇటీవలే జరిగిన సంఘటనలు, గత కార్యవర్గంలో సభ్యుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను కృష్ణంరాజుకు వివరించారు. ప్రస్తుత కార్యవర్గ పదవీకాలం ముగియడం వల్ల సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోవాలని కోరారు. ఆగస్టు 22న సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. సెప్టెంబర్ 12న అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కార్యవర్గ సభ్యుల ప్రతిపాదనలపై కృష్ణంరాజు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. రెండేళ్లకోసారి జరిగే మా ఎన్నికల్లో ఈసారి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తోపాటు యువ కథానాయుడు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ , హేమ, సీవీఎల్ నర్సింహరావు పోటీపడనున్నారు.

ఇదీ చూడండి.. రేపటి నుంచి థియేటర్ల సందడి.. రిలీజ్ కానున్న సినిమాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.