'పలాస 1978' సినిమాతో మెప్పించిన దర్శకుడు కరుణ కుమార్.. కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. 'మెట్రో కథలు' పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ను గీతా ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో అల్లు అరవింద్ నిర్మించారు. ఆగస్టు 14 నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు రచయిత కదిర్ బాబు 'మెట్రో కథలు' పుస్తకంలో ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. హైదరాబాద్ నగరంలోని నాలుగు జంటల మధ్య ఉండే అనుబంధాలు, భావోద్వేగాలు ఇందులో చూపించనున్నారు. రాజీవ్ కనకాల, అలీ రెజా, నక్షత్ర, తిరువీర్, నందిని రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.