ETV Bharat / sitara

మా జర్నీ పూర్తి అయింది: అనిల్ రావిపూడి - వరుణ్‌ తేజ్‌

F3 Movie Release Date: వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రానున్న 'ఎఫ్‌3' చిత్రం టాకీ పార్ట్​ పూర్తైంది. ఇక థియేటర్లలో నవ్వులు పూయించడమే తరువాయి అంటోంది చిత్రబృందం.

F3 Movie Release Date
F3 Movie
author img

By

Published : Jan 29, 2022, 8:06 PM IST

F3 Movie Release Date: వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కీలక పాత్రల్లో అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఎఫ్‌3'. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. గతంలో వచ్చిన 'ఎఫ్‌2'కు కొనసాగింపుగా కొత్త కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు వీడియోను పంచుకుంటూ, "మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలతుంది. వస్తే, కొద్దిగా ముందుగా.. వెళ్ళినా కొద్దిగా వెనకగా.. థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా" అంటూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్వీట్‌ చేసింది.

'ఎఫ్‌2'లో భార్యాభర్తల మధ్య చోటు చేసుకునే చిన్న చిన్న సంఘటనలను నవ్వించేలా తీర్చిదిద్దారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఇప్పుడు డబ్బు వల్ల భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు, ఇబ్బందులు వస్తాయన్నది 'ఎఫ్‌3'లో చూపించనున్నారు. ఏప్రిల్‌ 28న థియేటర్స్‌లో విడుదల కానుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: అదిరిపోయే ట్రైలర్​తో అజయ్​ దేవ్​గణ్.. 'బంగార్రాజు' సర్​ప్రైజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.