ETV Bharat / sitara

Salute movie review: పోలీస్​గా​ దుల్కర్​ ​ఆకట్టుకున్నాడా? - సెల్యూట్​ రివ్యూ

Salute movie review: మలయాళంతో పాటు, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ . ఇప్పటికే ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. తాజాగా రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో దుల్కర్‌ నటించిన చిత్రం 'సెల్యూట్‌'. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌ వేదికగా శుక్రవారం విడుదల అయ్యింది. ఈ చిత్ర రివ్యూ ఎలా ఉంది అంటే?

Salute movie review
దుల్కర్​ సల్మాన్​
author img

By

Published : Mar 18, 2022, 12:19 PM IST

Salute movie review: చిత్రం: సెల్యూట్‌; నటీనటులు: దుల్కర్‌ సల్మాన్‌, డయానా పెంటీ, మనోజ్‌ కె. జయన్‌, లక్ష్మి గోపాలస్వామి, సాయికుమార్‌, తదితరులు; ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌; సంగీతం: జేక్స్ బిజోయ్; నిర్మాణ సంస్థ: వేఫేరర్ ఫిల్మ్స్; నిర్మాత: దుల్కర్‌ సల్మాన్‌; కథ, స్క్రీన్‌ ప్లే: బాబీ సంజయ్‌; దర్శకత్వం: రోషన్‌ ఆండ్రూస్‌; విడుదల: సోనీలివ్‌

.

'మహానటి'తో తెలుగువారికి చేరువైన మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. తరచూ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నటుడిగా సాహసాలు చేస్తుంటారాయన. 'హే సినామిక' వంటి ఫీల్‌గుడ్‌ మూవీ తర్వాత ఆయన ఎంచుకున్న సీరియస్‌ కథా చిత్రం 'సెల్యూట్‌'. పోలీస్‌ ప్రొసీడరల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం సోనీలివ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? పోలీస్‌ పాత్రలో దుల్కర్‌ మెప్పించాడా?

కథేంటంటే: అరవింద్‌ కృష్ణ (దుల్కర్‌ సల్మాన్) మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై. అన్న అజయ్‌ కృష్ణ(మనోజ్‌ కె.జయన్‌) డీఎస్పీ కావడంతో అతడి స్ఫూర్తితోనే అరవింద్‌ కూడా పోలీస్‌ ఆఫీసర్‌ అవుతాడు. మల్కాజ్‌గిరిలో దంపతులు దారుణహత్యకు గురవుతారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి భరించలేక ఆటోడ్రైవర్‌ మురళిని ఈ కేసులో ఇరికించి, పోలీసులే సాక్ష్యాలు సృష్టించి అతడిని జైలుకు పంపతారు. ఈ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌లో అరవింద్‌ కూడా భాగమవుతాడు. అయితే, మురళికి జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక తన ఉద్యోగానికి దీర్ఘకాలం సెలవు పెడతాడు. ఇంతకీ ఈ హత్యలు చేసింది ఎవరు? సెలవుపై వెళ్లిన అరవింద్‌ మళ్లీ విధుల్లోకి రావడానికి కారణం ఏంటి? హంతకుడిని పట్టుకునేందుకు అరవింద్‌ చేసిన ప్రయత్నాలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

.

ఎలా ఉందంటే: సాధారణంగా క్రైమ్‌ థ్రిల్లర్‌ కథలు ఏదో ఒక హత్య చుట్టూ తిరుగుతాయి. ఆధారాలు లేని ఒక హత్య కేసును కథానాయకుడు ఎలా ఛేదించడాన్న ఉత్కంఠ కథ, కథనాలతో ఆ సినిమాలు సాగుతాయి. 'సెల్యూట్‌' ఆ కోవకే వచ్చినా కాస్త భిన్నమైన కథాంశం. ఒక హత్య జరిగిన తర్వాత పోలీసులు ఆ కేసు విచారణ ఎలా చేస్తారు? రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లు ఎలా ఉంటాయి? అలాంటి సమయంలో కేసును క్లోజ్‌ చేసేందుకు పోలీసులు అనుసరించే విధానాలేంటి? ఇలా ఒక్కో అంశాన్ని సవివరంగా చర్చించే క్రమంలో అసలు పాయింట్‌ పక్కకు వెళ్లిపోయి, కథనం నత్తనడకన సాగుతుందన్న విషయాన్ని దర్శకుడు మర్చిపోయాడు.

.

ప్రథమార్ధంలో ఎక్కువ భాగం దంపతుల హత్య కేసును ఆటో డ్రైవర్‌ మురళిపై నెట్టడానికి పోలీసులు ఎలా ఆధారాలు తయారు చేశారన్న దాని చుట్టూనే తిరుగుతుంది. అమాయకుడిని కేసులో ఇరికించడాన్ని తట్టుకోలేని అరవింద్‌ సెలవుపై వెళ్లడం, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సుదీర్ఘంగా సాగుతాయి. పాత్రల మధ్య సంభాషణలు విసుగ్గా అనిపిస్తాయి. కథానాయిక పాత్ర ఉంది కదాని, దర్శకుడు పాటలు, లవ్‌ ట్రాక్‌ జోలికి వెళ్లకపోవడం కాస్త ఉపశమనం. ఎప్పుడైతే అరవింద్‌ మళ్లీ విధుల్లోకి చేరి దంపతుల హత్య కేసును తిరగతోడటం మొదలు పెడతాడో అప్పటి నుంచి ప్రేక్షకుడిలో కథపై ఆసక్తి పెరుగుతుంది. హత్య కేసుకు సంబంధించిన ఆధారాల కోసం అరవింద్‌ ప్రయత్నించడం దానికి పోలీసులే అడ్డుపడటం, వాటిని ఛేదించుకుంటూ అతడు ముందుకు సాగడం ఇలా ఒకదాని తర్వాత మరో సన్నివేశం చకచకా సాగుతుంది. మరోవైపు అసలు హంతకుడు ఎవరన్న ఉత్కంఠ ప్రేక్షకుడి మదిని తొలిచేస్తుంది. అరవింద్‌ కూడా ఒక్కో పాయింట్‌ను కనెక్ట్‌ చేసుకుంటూ వెళ్లడంతో ఇక హంతకుడు దొరికేస్తాడన్న సమయానికి దర్శకుడు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు. అదేంటన్నది తెరపై చూడాల్సిందే. కాస్త ఓపికతో ఏదైనా థ్రిల్లర్‌ మూవీ చూడాలని అనుకుంటే, ఈ వీకెండ్‌లో 'సెల్యూట్‌' చూడొచ్చు. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఎవరెలా చేశారంటే: నిజాయతీ కలిగిన యువ పోలీస్‌ ఆఫీసర్‌ అరవింద్‌ కృష్ణగా దుల్కర్‌ సల్మాన్‌ చక్కగా నటించాడు. ఏ సన్నివేశంలో అతి చేయలేదు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి చివరి వరకూ సెటిల్డ్‌గా కనిపించాడు. కథానాయిక డయానా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. మనోజ్ కె, లక్ష్మీ గోపాల స్వామి సహా పోలీసులుగా చేసిన వారందరూ కొత్తవారే. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు. సాంకేతికంగా సినిమా ఓకే. అస్లాం సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలో థ్రిల్‌ మూడ్‌ కలిగించేలా లైటింగ్‌ ఎఫెక్ట్స్‌ వాడారు. ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. బహుశా మలయాళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమా కావడంతో నిడివి విషయం పెద్దగా పట్టించుకోలేదనిపిస్తోంది. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం పర్వాలేదు. దర్శకుడు రోషన్‌ ఆండ్రూస్‌ ఓ డిఫరెంట్‌ థ్రిల్లర్‌ కథాంశాన్ని ఎంచుకున్నాడు. అయితే, పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ డీటేలింగ్‌ పేరుతో కథనాన్ని మాత్రం సాగదీశాడు. నిడివి తగ్గి, కథనాన్ని బిగి సడలకుండా నడిపించి ఉంటే సినిమాకు నిజంగా 'సెల్యూట్‌' చేయొచ్చు.

బలాలు

+ దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌

+ దుల్కర్‌ సల్మాన్‌ నటన

+ ద్వితీయార్ధం

బలహీనతలు

- ప్రథమార్ధం

- నెమ్మదిగా సాగే కథనం

చివరిగా: 'సెల్యూట్‌' చూడాలన్నా, చేయాలన్నా ఓపిక కావాలి.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఇదీ చూడండి:

ఆర్​ఆర్​ఆర్​ ప్రీమియర్​ షోకి ప్రభాస్​.!

చరణ్​ నువ్విస్తే విషమైనా తాగుతా: ఎన్​టీఆర్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.