ETV Bharat / sitara

ఆ ఒక్క డౌట్​తో నాగ్​ పాన్​ఇండియా మూవీకి బ్రేక్​ - నాగార్జున పాన్​ ఇండియా సినిమా ఎస్​ గోపాల్​ రెడ్డి

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ఈ వారం ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ ఎస్​ గోపాల్​రెడ్డి విచ్చేసి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హీరో నాగార్జునతో చేయాల్సిన పాన్​ ఇండియా సినిమా ఆగిపోవడానికి కారణాలు చెప్పారు. రాజమౌళి-మహేశ్​ సినిమా గురించి కూడా మాట్లాడారు.

nagarjuna
నాగార్జున
author img

By

Published : Jul 27, 2021, 1:45 PM IST

సినిమాటోగ్రాఫర్​, స్క్రీన్​రైటర్​, దర్శకుడు, నిర్మాత.. ఇలా చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్​ గోపాల్​రెడ్డి. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోకు ఈ వారం అతిథిగా విచ్చేసిన ఈయన తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇందులో భాగంగా 1994-95లోనే హీరో నాగార్జునతో కలిసి పాన్​ ఇండియా సినిమా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు గుర్తుచేసుకున్నారు. కానీ ఆ చిత్రం కొన్ని అనివార్య కారణాల ప్రారంభంలోనే నిలిచిపోయినట్లు వెల్లడించారు.

"సినిమాటోగ్రాఫర్​ అయిన నా స్నేహితుడు ఒకరు యాక్షన్​ కథ రాసుకున్నాడు. అతడే ఈ కథకు దర్శకత్వం వహించాలనుకున్నాడు. ఆ కథ నాకు చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. హీరో నాగార్జునతో ఈ సినిమా చేయాలనుకున్నాం. అప్పటికే 'హలో బ్రదర్​' చిత్రం అయిపోయింది. డింపుల్​ కపాడియా, నసీరుద్దీన్ షా​, అనుపమ్​ ఖేర్​ను తీసుకోవాలనుకున్నాం. సినిమా తీయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశాం. మరో నెలరోజుల్లో చిత్రీకరణ ప్రారంభమవుతుందన్న నేపథ్యంలో ఆపేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే.. చివరి సీక్వెన్స్​ మార్చాలని నాగ్​తో పాటు మిగతావారు అడిగారు. కానీ దర్శకుడు ఒప్పుకోలేదు. అలా ఈ సినిమాను పక్కనపెట్టాల్సి వచ్చింది." అని గోపాల్​ పేర్కొన్నారు.

దర్శకుడు జంధ్యాల వల్ల తాను నిర్మాతగా మారినట్లు చెప్పారు గోపాల్​రెడ్డి. "జంధ్యాల ఓ కథ చెప్పారు. అది బాగా నచ్చింది. ఈ సినిమాను నేనే నిర్మించాలనుకున్నాను. మేమిద్దరం కలిసి బాలకృష్ణకు కథ చెప్పగా ఓకే అన్నారు. మిగతా నటీనటులకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశాం. లొకేషన్స్​ కూడా చూశాం. ఈ క్రమంలోనే అకస్మాతుగా జంధ్యాల నా దగ్గరకు వచ్చి మరో కథ చెబుతానన్నారు. 'మొదటి సినిమా ప్రయోగాత్మకం ఎందుకు? డబ్బులు పోతే నా వల్లే పోయానని బాధపడతాను. అందుకే కమర్షియల్​గా సినిమా చేద్దాం' అని 'బాబాయ్​ అబ్బాయ్'​ కథ చెప్పారు. ఇదే విషయం బాలయ్యకు చెప్పాం. ఆయన కూడా ఒప్పుకున్నారు. అలా నా తొలి సినిమా 'బాబాయ్​ అబ్బాయ్​' చేశాం." అని అన్నారు.

దర్శకధీరుడు రాజ్​మౌళి.. 'ఆర్​ఆర్​ఆర్​' తర్వాత సూపర్​స్టార్​ మహేశ్​బాబుతో సినిమా చేయనున్నారని, అది తన బ్యానర్​లోనే తెరకెక్కుతుందని తెలిపారు గోపాల్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఎస్వీ రంగారావుగారిని అలా చూస్తే జాలేసింది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.