నందమూరి బాలకృష్ణ 'అఖండ' ట్రైలర్(akhanda trailer) వచ్చేసింది. అఘోరాగా డిఫరెంట్ గెటప్‌లో కనిపించిన బాలయ్య(balayya movies).. తన డైలాగ్స్‌తో గర్జించారు. అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నారు. అలానే సినిమాను థియేటర్లలో డిసెంబరు 2న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal movies) హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్(thaman songs) సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన 'అఖండ' రోర్(akhanda release date), టైటిల్ సాంగ్ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య(balakrishna movies telugu) రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. అందులో అఘోరా రోల్ కూడా ఉండటం విశేషం.
మరోవైపు బాలయ్య కొత్త సినిమా(balayya new movie updates) శనివారమే లాంఛనంగా ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రుతిహాసన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
సినిమాలే కాకుండా ఓటీటీలోనూ 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'(unstoppable with nbk) షోలో హోస్ట్‌గా బాలయ్య చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్లు.. అభిమానుల్ని అలరిస్తున్నాయి. తొలి ఎపిసోడ్‌కు మోహన్‌బాబు, రెండో ఎపిసోడ్‌కు నాని అతిథులుగా వచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: