Ashu Reddy kisses Ariyana Glory: బిగ్‌బాస్ బ్యూటీస్ అషురెడ్డి, అరియానా గ్లోరీ సామాజిక మాధ్యమాల్లో హీటు పుట్టిస్తున్నారు. షోతో వచ్చిన పాపులారిటీని తమ బోల్డ్ కంటెంట్‌తో మరింత పెంచుకుంటున్నారు ఈ భామలు. తాజాగా అరియానాకు అషు ముద్దు పెట్టడం వల్ల.. ఈ జోడీ మరోసారి వైరల్‌గా మారింది.

ఆకుపచ్చ దుస్తుల్లో తళుక్కున్న మెరుస్తోన్న అరియానా నడుముపై రెండు చేతులూ వేసి ముద్దు పెట్టుకుంది అషురెడ్డి. దానికి అరియానా అదిరిపోయే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫొటోను అషు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'ఇలాంటి ఫొటోతో అందరూ మనల్ని తప్పుగా అనుకుంటున్నారు, జడ్జ్ చేస్తున్నారు' అని అరియానా కామెంట్ చేసింది. అయితే మంచైనా, చెడైనా జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారని, మనకు నచ్చింది చేసుకుంటూ పోవడమే అని అషురెడ్డి బదులిచ్చింది. ఇది తాను ఆర్జీవీ నుంచి నేర్చుకున్నట్లు తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: రెచ్చగొడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ అందాలు