ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న 'పుష్ప'(allu arjun pushpa) మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇటీవల సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ కావడం(pushpa leak song) వల్ల.. చిత్రబృందం పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో సెట్లో మరిన్ని భద్రతా ఏర్పాట్లు చేసింది.
![Allu arjun Pushpa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12849131_psuhpa-1.jpg)
బన్నీ సరసన రష్మిక హీరోయిన్గా చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ప్రతినాయకుడు ఫహాద్ ఫాజిల్(pushpa fahad) రంగంలోకి దిగారు. ఈయనపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇటీవలే విడుదల చేసిన 'దాక్కో దాక్కో మేక' పాటకు లభిస్తున్న స్పందనపై చిత్రబృందంపై సంతృప్తి వ్యక్తం చేసింది.
![fahad fazil pushpa movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12849131_psuhpa-3.jpg)
ఇవీ చదవండి: